వాడ్నీ చూసి హడలెత్తుతున్న జర్నలిస్టులు.. Robot Reporter Writes Article In One Second

Robot reporter makes newspaper debut writes article in one second

Robots in journalism,Robot reporters in china,robot journalists in media,robot journalist made its debut in china media,robot journalist in chinese media,robot journalist in china media,first robot reporter introduced in world,first robot reporter introduced in china, Robot Reporter, Xiao Nan, robo scribe debut, Chinese daily, article in a second, Guangzhou, Southern Metropolis Daily, Spring Festival travel rush, trending news

A robot journalist made its debut in a Chinese daily with a 300 characters-long article written in just a second, published in Guangzhou-based Southern Metropolis Daily, focused on the Spring Festival travel rush.

వాడ్నీ చూసి హడలెత్తుతున్న జర్నలిస్టులు..

Posted: 01/19/2017 01:56 PM IST
Robot reporter makes newspaper debut writes article in one second

జర్నలిస్టులు.. వీళ్లను చూస్తే అక్రమార్కులు అమడ దూరం వుంటారు. అయితే వీళ్లు మాత్రం ఎవరి వద్దకైనా వెళ్లి వారి ఇంటర్వ్యూలు, లేక వారి అభిప్రాయాలు సేకరిస్తుంటారు. ప్రధాని మొదలుకుని ముఖ్యమంత్రులు, పార్టీ అధినేతలు, నేతలు ఇలా అందరి అభిప్రాయాలను ప్రజల మందు అవిష్కరించడంతో పాటు.. ప్రజల సమస్యలను, ఇబ్బందులను పాలకుల దృష్టికి కూడా తీసుకువస్తుంటారు. అయితే తాజాగా జరిగిన ఓ పరిణామాం మాత్రం వీరిని చాలా హడలెత్తిస్తోంది. ఆ వ్యక్తిని చూస్తే జర్నలిస్టు బెంబేలెత్తిపోతున్నారు.

ఇ:తకీ ఎవరా వ్యక్తి..? ఏమా కథ..? పాత్రికేయులకే ముచ్చెమటలు పట్టించే ధైర్యమా..? వివరాలేంటి సుమా..? అంటూ ఉత్సహాకపడుతున్నారు కదూ. వ్యక్తి అంటే వ్యక్తే. కాని కాదు. మర మనిషి. అదేనండి మరోవిధంగా చెప్పాలంటే రోబో. రోబోలకు జర్నోలకు ఏంటీ సంబంధం అంటారా..? జర్నలిజంలోకి అడుగుపెట్టిన తొలి రోబో..  ఒక అర్టికల్ ను రాయడం.. దానిని ప్రచురించడం కూడా జరిగిపోయింది. దీంతో వాయ్మో రోబోలు మన ఉద్యోగాలకు ఎసరు పెట్టేందుకు వచ్చేస్తున్నాయంటూ జర్నలిస్టులు లబోదిబోమంటున్నారు.

చైనాలో ఈ సరికొత్త ప్రయోగం చోటుచేసుకుంది. గ్వాంగ్జూ సిటీకి చెందిన సౌతెర్న్ మెట్రోపొలిస్ డైలీలో తొలిసారిగా ప్రయోగాత్మకంగా ఓ రోబో రాసిన ఆర్టికల్ ప్రచురితమైంది. స్ప్రింగ్ మాసం అరంభం సందర్భంగా మన వద్ద సంక్రాంతి పేరతో జరుపుకునే పండగనే అక్కడ చేసుకుంటారు. అయితే ఈ పండగ నేపథ్యంలో బస్సులు, రైళ్లు, రోడ్లు రద్దీగా వుండటంతో రోబో జర్నిలిస్టు ఈ అంశమై 'స్ప్రింగ్ ఫెస్టివల్ ట్రావెల్ రష్' శీర్షికన మొత్తం 300 పదాలు కలిగిన ఆర్టికల్‌ను రాసింది. అయితే దీనిని రాయడానికి రోబో జర్నలిస్టు తీసుకున్న సమయం మాత్రం ఒక్క సెకండు మాత్రమే.


దీంతో జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత అంశమై భయం అలుముకున్నట్లైంది. ఒక్క క్షణంలో అర్టికల్ ను రాయగల సత్తా వున్న రోబోలు భవిష్యత్ కాలంతో తమ ఉద్యోగాలకు సవాల్ విసరుతాయని పాత్రికేయులు అందోళన చెందుతున్నారు. అర్టికల్ తో పాటు ఈ రోబో షార్ట్ స్టోరీలు, లాంగ్ ఆర్టికల్స్.. ఇలా ఏవైనా రాయగలదని రోబోని తయారు చేసిన పరిశోధన చేస్తున్న పెకింగ్ యూనివర్శిటీ ప్రొఫెసర్ వాన్ జియోజున్. స్టాఫ్ రిపోర్టలతో పోల్చుకున్నా... ఈ జియావో నాన్ వద్దే అత్యధిక సమాచారమే ఉందని కూడా కితాబిస్తున్నారు. అయితే ఈ రోబోలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో తెలియాలంటే.. వేచి చూడక తప్పదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh