రాజకీయాలపై రాములమ్మ మౌనం.. కోర్టుకు హాజరు.. vijaya shanti attends court, keeps mum on politics

Vijayashanti attends court keeps mum on politics

vijaya shanti, talli telangana party, TRS, cm kcr, kcr god given sister, congress, railway court, telangana movement, telangana agitation, crime news

Actress turned politician vijaya shanti attend railway court at secundrabad, while talking to media she says will definetly speak on her political career at appropriate time

రాజకీయాలపై రాములమ్మ మౌనం.. కోర్టుకు హాజరు..

Posted: 01/19/2017 11:37 AM IST
Vijayashanti attends court keeps mum on politics

తెలుగు వెండితెరపై లేడీ డాన్ గా లేడీ అమితాబ్ గా వెలుగొందిన సినీనటి విజయశాంతి.. రాజకీయాలలోకి అడుగుపెట్టి గత ఎన్నికలలో తెలంగాణ డిఫ్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి చేతిలో పరాజయం పాలైన తరువాత దాదాపుగా రాజకీయాలకు దూరంగా వుంటూవస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరపున సిద్దపేట నుంచి పార్లమెంటు సభ్యురాలిగా గెలిచిన తరువాత.. గత ఎన్నికలలో అమె కాంగ్రెస్ పార్టీలో చేరి.. అసెంబ్లీ స్తానానికి బరిలో నిలిచి ఓటమిపాలైన విషయం విధితమే.

ఇవాళ సికింద్రాబాద్ లోని రైల్వే కోర్టుకు అమె హాజరైయ్యారు. అమెపై నమోదైన ఓ కేసును ఈ సందర్భంగా ఈ నెల 24కు న్యాయస్థానం వాయిదా వేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన రైల్ రోకో కార్యక్రమంలో విజయశాంతి పాల్గొన్న నేపథ్యంలో అప్పటి రైల్ రోకో కు సంబంధించి కేసులో అమెపై కూడా కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తమే ఆమె ఈ రోజు రైల్వే కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి లేని కారణంగా కేసు విచారణను 24వ తేదీకి వాయిదా వేశారు.

ఈ సందర్భంగా, విజయశాంతిని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారంటూ ప్రశ్నలను సంధించారు. అయితే మీడియా ప్రతినిధుల ప్రశ్నలపై అమె సమాధానాలు దాటవేశారు. తాను రాజకీయాలకు ఎందుకు దూరంగా వుంటున్నానన్నది.. తన రాజకీయ భవితవ్యమేమిటన్న విషయాలపై తాను తప్పనిసరిగా మాట్లాడతానని, అయితే న్యాయస్థానానికి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాటిపై స్పందించడం సబబు కాదని రాములమ్మ పేర్కోనింది. కాగా సమయం, సందర్భం వచ్చినప్పుడు తానే మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles