సోషల్ మీడియాలో ‘ఆ’ వీడియోలపై కేంద్రం సీరియస్ Sumit Verma 'kissing prank' slammed online

Centre serious on sumit verma kissing prank after slammed online

rickshawali, indian youtuber rickshawali, indian youtuber rickshawali on sumit verma, sumit verma youtube prank gone wrong, sumit verma youtube, sumit verma, youtube prank, union government, entertainment

Indian YouTuber Sumit Verma recently courted trouble after his "kissing prank" video- where he is seen kissing unsuspecting women before fleeing- was widely slammed on social media.

ITEMVIDEOS: సోషల్ మీడియాలో ‘ఆ’ వీడియోలపై కేంద్రం సీరియస్

Posted: 01/12/2017 11:35 AM IST
Centre serious on sumit verma kissing prank after slammed online

సోషల్ మీడియాలో హీరోలు అయ్యేందుకు కొందరు అకతాయిలు చేస్తున్న పద్దతులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. తమ వీడియోలు వైరల్ గా మారి.. వాటి నుంచి డబ్బులు కూడా పొందేందుకు చేస్తున్న సరదా వీడియోలు ఒకరి మనస్సును నొప్పించడం వంటి చర్యలపై తీవ్రంగా స్పందించింది. ముద్దు పెట్టి సారీ చెబితే సరిపోతుందా.. వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించినంత మాత్రన తప్పులన్నీ ఒప్పులుగా మారవని, ఇకపై ఇలాంటి వీడియో పోస్టింగులపై చర్యలు తప్పవని తేల్చిచెబుతుంది.

ఇకరి సరదా.. మరొకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని, ఈ వీడియోలలో తాము ఎదుర్కోన్న పరిస్థితులు బాధితతులను జీవితాంతం వేధిస్తుంటాయని కూడా కేంద్రం చెప్పింది. వీటి ప్రభావం సమాజం విలువలపైనా పడుతున్నాయని పేర్కోంది. సోషల్ మీడియా వేదికగా ప్రాంక్స్ పేరుతో జరుగుతున్న నీచమైన వీడియోలపై కేంద్రం కన్నెర్ర చేసింది. ప్రాంక్స్ చూసే.. ఇటీవల బెంగళూరులో జరిగిన ఘటనలకు ఎగ్జాంపుల్ అని నిందితులు చెప్పటం దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.

రోడ్డుపై వెళుతున్న ముక్కూ ముఖం తెలియని అమ్మాయిని ముద్దు పెట్టుకుని పరిగెత్తటం.. భార్యభర్తలు వెళుతుంటే భర్త ముఖానికి క్రీమ్ రాసి.. అతని భార్యను హగ్ చేసుకోవటం ఏం సంస్కృతి చెబుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు. నేటి యువత ఇలాంటి ప్రాంక్స్ ను యూట్యూబ్ లో  చూసి అనుకరించటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇలాంటి విషయాలు చాలా వరకు పోలీస్ స్టేషన్ వరకు కూడా రావటం లేదు. సారీతోనే సరిపెడుతున్నారు.

ఇటీవల బెంగళూరులో అర్థరాత్రి ఓ అమ్మాయిని కౌగిలించుకోవటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. విచారణలో కావాలనే అలా చేశామంటూ నిందితులు చెప్పడం పోలీసులనే విస్మయపరిచింది. ప్రాంక్స్ పేరుతో అమ్మాయిలను లైంగిక వేదింపులకు గురిచేసి ఆ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే అట్టివారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు పోలీసులు. కఠిన శిక్ష విధించడంతో పాటు చదివిన డిగ్రీని రద్దు చేస్తామని పాస్ పోర్ట్ కూడా రద్దు చేసి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటామని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rickshawali  sumit verma  youtube prank  union government  entertainment  

Other Articles