దేశాన్ని కుదిపేస్తున్న అవినీతి అంశంలో చంద్రబాబు పేరు..! chandrababu name flashes in sahara dairy

Chandrababu name flashes in sahara dairy

sahara diaries, kickbacks, bribe, corruption, cash for vote, note for vote, horse riding, tehelka, heritage, vara prasad, sahara, chandrababu naidu, andhra pradesh

Andhra Pradesh Chief Minister chandrababu name flashes in sahara dairy, lawyer prashanth bushan alleges in supreme court.

దేశాన్ని కుదిపేస్తున్న అవినీతి కేసులోనూ చంద్రబాబు పేరు..!

Posted: 01/12/2017 01:57 PM IST
Chandrababu name flashes in sahara dairy

దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న బిర్లా సహారా డైరీల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు కూడా వుండటం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపుతుంది. ఈ మేరకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వెల్లడించడం కలకలం రేపింది. ఈ కేసు విచారణ సందర్భంగా కిక్కిరిసిన కోర్టు రూమ్ లో ప్రశాంత్ భూషణ్ సహరా డైరీలలో పేర్లు ఉన్న రాజకీయ నాయకుల వివరాలు వెల్లడించగా అందులో చంద్రబాబు పేరు కూడా వుండటం తెలుగు రాష్ట్ర ప్రజలను మురీ ముఖ్యంగా నవ్యాంధ్రవాసులను ఉల్లిక్కిపడేలా చేసింది.

2014లో సహరా గ్రూప్ పై జరిపిన ఐటీ శాఖ దాడులలో దొరికిన డైరీలలో రాజకీయ నాయకులకు ముడుపులు ముట్టజెప్పిన విషయాలు ఉన్నట్టు వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ప్రధానిని లక్ష్యంగా చేసుకుని ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానంలో ఈ పిటీషన్ ను దాఖలు చేయగా, వాదనల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పేరు 'గుజ్ సీఎం' (Guj CM), 'మోదీజీ' అంటూ ఈ డైరీలలో పేర్కొని ఉందని పదేపదే భూషణ్ కోర్టులో నొక్కి చెప్పారు.

ప్రధాని నరేంద్రమోడీతో పాటు సుష్మా స్వరాజ్, చంద్రబాబు, ములాయం సింగ్, మాయావతి, ప్రమోద్ మహాజన్ కూతురు, శివ్ రాజ్, రాజస్థాన్, బిహార్ ముఖ్యమంత్రులు, లాలూ, అద్వానీ, రవిశంకర్, షిండే, ఫరూక్ అబ్దుల్లా, ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే, దిగ్విజయ్ సింగ్ తదితరుల పేర్లు ఉన్నట్టు సహారా డైరీలో వున్నాయని తెలిపారు. 'దాదా' అనే పేరు ఈ డైరీలలో నాలుగుసార్లు రాసి ఉంది. కానీ, ఆయన ఎవరు అని ఊహించడానికి కూడా ఎవరూ సాహసం చేయడం లేదు. అయితే తాను నీతికి, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకునే చంద్రబాబు పేరు కూడా ప్రస్తావనకు రావడం చర్చనీయాంశంగా మారింది.

 బిర్లా, సహారా గ్రూపుల నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు నాయకులు ముడుపులు స్వీకరించారంటూ దాఖలైన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. మామూలు కాగితాలు, డైరీల్లోని పేజీలు, ఈ మెయిల్‌ ప్రింటవుట్లు,  సాధారణ డాక్యుమెంట్లు సాక్ష్యాలుగా చూపించారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు, విచారణకు ఆదేశించలేం. అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి వ్యతిరేకంగా ఉన్న పత్రాల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది’ అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ అమితవ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తేల్చిచెప్పింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh