ప్రెసిడెంట్ ట్రంప్.. మళ్లీ పిచ్చి కూతలు | Trump Admits To Russian Hacking and fire on Media.

Donald trump on election related hacking

US president, Donald Trump, Trump claims Russia hack, Putin Trump, Donald Trump first press meet, US president Trump, Trump admit hacking, Donald Trump Russia

Donald Trump claims Russia will stop hacking US, says Putin liking him is an 'asset'.

రష్యా హ్యాకింగ్.. నిజమే కావొచ్చు : ట్రంప్

Posted: 01/12/2017 10:11 AM IST
Donald trump on election related hacking

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరు తెరిచాడు. పెద్దన్న రోల్ లో మొదటి సారి మీడియా ముందుకు వచ్చిన ట్రంప్ మీడియాపై విరుచుకుపడటమే కాదు, రష్యా హ్యాకింగ్ వార్తలపై కూడా స్పందించాడు. ఈ క్రమంలో మీడియాపై అసహానం ప్రదర్శించి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేశాడు.

ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి, ఎన్నికల ప్రక్రియను రష్యా హ్యాక్ చేసిందని వస్తున్న వార్తలపై ఇప్పటిదాకా ఒక్క మాట కూడా మాట్లాడని ట్రంప్, చివరికి అది నిజమయ్యే ఉండవచ్చని అన్నారు. అయితే కేవలం రష్యా హ్యాకింగ్ కారణంగానే తాను విజయం సాధించానన్నది మాత్రం అవాస్తవమని, ప్రజల మద్దతుతోనే తాను గెలిచానని చెబుతున్నాడు. డీఎన్సీ (డెమోక్రటిక్ నేషనల్ కమిటీ) సర్వర్ హ్యాక్ అయ్యుండవచ్చని దీని వెనకాల ఒక్క రష్యా మాత్రమే ఉందని అనుకోవటం లేదని, మరిన్ని దేశాలు దీని వెనుక కుట్ర చేశాయన్న అనుమానం ఉందన్నాడు. డీఎన్సీ సర్వర్లలో సరైన రక్షణాత్మక వ్యవస్థ లేదని, సైబర్ సెక్యూరిటీ లోపాల వల్లే హ్యాంకింగ్ సాధ్యమైందని అన్నారు.

ఇక హామీల చిట్టా విప్పితూ విచిత్రమైన వ్యాఖ్యలు చేశాడు. అమెరికాలో నిరుద్యోగులకు దేవుడు కూడా ఇవ్వలేనన్ని ఉద్యోగావకాశాలను ఇచ్చి చూపిస్తానని వ్యాఖ్యానించాడు. మెక్సికో సరిహద్దుల్లో భారీ గోడ కట్టేది కూడా నిజమేనన్న ట్రంప్, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసితీరుతానన్నాడు. రష్యా వద్ద తన సీక్రెట్స్ ఉన్నాయని వచ్చిన వార్తలపై స్పందిస్తూ, అంతా కట్టుకథని, ఈ తరహా ఆరోపణలు చేసి అధ్యక్షుడిని అవమానిస్తున్నారని విమర్శించారు.

తనంటే గిట్టని వాళ్లు చేస్తున్న ప్రచారాన్ని పట్టించుకోబోనని చెబుతూనే, పిచ్చివాళ్లు తనవెంట పడుతున్నారని అన్నారు. నిఘా సంస్థలు సైతం తనకు వ్యతిరేకంగా ఉన్నాయని, అవే మీడియాకు లీకులిస్తున్నాయని ఆరోపిస్తూ, అదే నిజమైతే, ఆయా సంస్థల చరిత్రలో మాయని మచ్చలు పడ్డట్టేనని అన్నారు.

"మీవన్నీ తప్పుడు వార్తలు.. రాసిందంతా చెత్త. నాపై మీడియాలో వచ్చిన వార్తలన్నీ చూశా. అవన్నీ పిచ్చిరాతలు, అవాస్తవాలు" అని అమెరికా నూతన అధ్యక్షుడిగా ఈ నెల 20న పదవీ బాధ్యతలు స్వీకరించనున్న డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత తొలిసారిగా మీడియాతో మాట్లాడిన ట్రంప్, రష్యాతో తనకు సంబంధాలు లేవని, పుతిన్ తనను ఇష్టపడుతున్నారంటే, అది అమెరికాకు సానుకూలాంశమేనని అన్నారు.

చైనా దూకుడును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేసిన ఆయన, పనిలోపనిగా రష్యాపైనా విరుచుకుపడ్డారు. రష్యా సహా కొన్ని దేశాలు అమెరికా కంప్యూటర్లను హ్యాక్ చేసిన మాట నిజమేనని, అయితే, అవి డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కమిటీవని ఎద్దేవా చేశారు. రిపబ్లికన్ పార్టీ కంప్యూటర్లు హ్యాకింగ్ కు గురి కాలేదని అన్నారు. తనను ఇబ్బంది పెట్టే ప్రశ్న ఎదురైన ప్రతిసారీ ట్రంప్ ఆవేశంగా మాట్లాడారు. తానింక వ్యాపార కార్యకలాపాల్లో పాలు పంచుకోబోనని, తన వ్యాపార బాధ్యతలను కుమారులకు అప్పగించానని చెప్పుకొచ్చాడు. కాగా, తన కుటుంబ సభ్యులు, ప్రధాన అనుచరులతో కలసి ట్రంప్ తొలి మీడియా సమావేశంలో పాల్గొనగా, పలు దేశాల మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : America President  Donald Trump  Russia  Election hack  

Other Articles

Today on Telugu Wishesh