రాజధానిలో నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు.. Delhi police busted fake currency racket

Delhi police arrest two people in connection with fake currency racket

Delhi police arrest two people in connection with fake currency racket, India news, Delhi, transaction, fake currency, fake currency racket busted, crime news

The Delhi police busted fake currency racket and arrested two persons, who allegedly printing fake currency notes of Rs. 2000 and Rs. 500

రాజధానిలో నకిలీ కరెన్సీ రాకెట్ గుట్టురట్టు..

Posted: 01/10/2017 12:14 PM IST
Delhi police arrest two people in connection with fake currency racket

నకిలీ కరెన్సీతో దేశంలో శాంతిభద్రతలకు విఘాత్నం కల్పిస్తున్న తీవ్రవాద శక్తులకు, దేశంలోకి చోచ్చుకువచ్చి ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఉగ్రవాదులకు కళ్లెం వేశామని స్వయంగా దేశ ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన నేపథ్యంలో పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్ కూడా మన దేశానికి సంబంధించిన కొత్త కరెన్సీని ఎట్టి పరిస్థితుల్లో ముద్రించలేదని ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రధాని చెప్పినట్లుగానే అంతా జరిగితే బాగానే వుండు. కానీ ఏకంగా దేశంలోని కొందరు అగంతకులు మాత్రం ప్రధానికి, దేశ అర్థికాభివృద్దికి సవాల్ విసురుతున్నారు.

నకిలీ కరెన్సీ, అంతర్గత తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త కరెన్సీ తీసుకొస్తే.. దానికి ఎక్కడో దేశ సరిహద్దుల అవల కాకుండా.. దేశంలోనే అగంతకులు నకిలీవి సృష్టిస్తున్నారు. రెండు వేల రూపాయల నోటును గతేడాది నవంబర్ 10 విడుదల చేయగా, విడుదలైన రెండో రోజేనే డూప్లికేట్‌ తయారుచేశారు కేటుగాళ్లు. మన వద్దు రాచకొండ కమీషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో కూడా నకిలీనోట్ల ముఠాను పట్టుకుని వారి నుంచి ఫేక్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

ఏకంగా బ్యాంకు ఏటీయంలోనూ కొత్త 2000 రూపాయల నోటు బయటపడటంతో దానిని తాత్కాలికంగా బంద్ చేశారు. ఒకరు కలర్ జిరాక్స్ తో నకిలీ నోట్లు ముద్రిస్తుండగా, మరోకరు మరో విధంగా నకిలీ నోట్లను ముద్రిస్తున్నారు. దేశ ప్రజలకు ఇప్పటికీ కొత్త నోట్లపై సరైన అవగాహన లేకపోవడంతో ఫేక్ నోట్ల చలామణి ఈజీగా అవుతుందని కేటుగాళ్లు బావిస్తున్నారు. కాగా, నకిలీ కరెన్సీ భారీ మొత్తంలో బయటపడిన సందర్భాలు మాత్రం అరుదు. దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఉదయం ఓ ముఠాను పట్టుకున్న పోలీసులు.. వారి నుంచి ఏకంగా రూ.6.1 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ వీధుల్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని, బ్యాగులు పరిశీలించగా భారీగా కొత్త నోట్లు కనిపించాయని, అయితే అదంతా నకిలీ కరెన్సీయేనని నిర్ధారించుకున్న వెంటనే ఇద్దరినీ అరెస్ట్‌ చేశామని పోలీసులు మీడియాకు వెల్లడించారు. సెక్యూరిటీ ఫీచర్లతో తయారైన కొత్త నోట్లు మార్కెట్‌లోకి విడుదలైన(నవంబర్‌ 10) ఢిల్లీలో నకిలీ కరెన్సీ ఇంత మొత్తంలో పట్టుబడటం ఇదే మొదటిసారి. ప్రధాని నుంచి ఉత్తమ ఇంజనీరుగా అవార్డును అందుకున్న మొహాలీకి చెందిన ఇంజనీర్‌ నుంచి స్వాధీనం చేసుకున్న రూ.42లక్షలే భారీ మొత్తం కాగా, రాజ్‌కోట్‌లోనూ రూ.26 లక్షల ఫఏక్స్ కరెన్సీ ఈ తరువాతది.. ఈ రెండింటి తర్వాత ఇవాళ ఢిల్లీలో లభ్యమైన రూ.6.1 లక్షలే భారీ ఫేక్‌ కరెన్సీగా నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi  transaction  fake currency  fake currency racket busted  crime news  

Other Articles