నైటీ లో వచ్చాడు... మహిళతో ఎంజాయ్ చేశాడు... విప్పి చూస్తే షాక్.. | man try to drug husband and enjoying with woman.

Pune woman s lover caught in nightie

Pune Woman, Illegal Affair, Pune Illegal Affair, Woman's Lover Caught, Nightie man affair, man try to drug husband

Pune Woman's Lover Caught In Nightie, Trying To Drug Her Husband With Chloroform!

భార్య నైటీతో అక్రమ సంబంధం.. విప్పి చూస్తే షాక్

Posted: 01/10/2017 12:59 PM IST
Pune woman s lover caught in nightie

సాఫీగా సాగిపోతున్న సంసారంలో అక్రమ సంబంధాలు పెట్టే చిచ్చు ఏపాటిదో తరచూ పలు ఉదంతాలు నిరూపిస్తున్నాయి. అయితే ఇక్కడ చెప్పుకోబోయే కేసే కాస్త విచిత్రమైంది. ఎందుకంటే ఇందులో చాలా ట్విస్టులు ఉన్నాయి కాబట్టి.  అఫైర్ కోసం లవర్ భర్తకు మత్తు మందు ఇవ్వటం ఒక ఎత్తు అయితే, అందుకోసం అతగాడు ధరించిన గెటప్ మరో ఎత్తు. ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే... అతగాడు ఆ బాధిత భర్తకు క్లోజ్ ఫ్రెండ్ కావటమే.

పుణె సమీపంలోని బిదేవాడి లో జరిగిన ఘటన వివరాళ్లోకి వెళ్లితే... నైటీ వేసుకుని, చున్నీతో ముఖం కప్పుకుని వచ్చి, నిద్రిస్తున్న తనకు క్లోరోఫాం వేసిన హ్యండ్ కర్చీఫ్ వాసన చూపించి పని ముగించుకు వెళుతుండే ఓ ప్రబుద్ధుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు సదరు భర్త. తీరా ముసుగు తొలగించి చూస్తే అతను తన స్నేహితుడే. శుక్రవార్ పేట్ లో ఉంటూ, వంట పాత్రల వ్యాపారం చేసుకునే ఓ కుటుంబానికి 44 ఏళ్ల రాజేష్ గిషూలాల్ మెహతా స్నేహితుడు. వీరి ఇంటికి మెహతా వచ్చి పోతూ ఉంటాడు కూడా. ఇటీవలి కాలంలో తాను లేని సమయంలో మెహతా వచ్చి వెళుతున్నాడని అపార్టుమెంట్ సెక్యూరిటీ గార్డు చెప్పడంతో, తన ఇంటికి రావద్దని హెచ్చరించాడు కూడా.

ఆపై మెహతా డ్రామా మొదలైంది. తానెవరో తెలియకుండా ఉండేందుకు, అమ్మాయిలా కనిపించేందుకు ఓ నైటీ, దుప్పట్టా ధరించి రాకపోకలు సాగించడం ప్రారంభించాడు. రాత్రి పూట క్లోరోఫాం పూసిన కర్చీఫ్ తో తన ప్రియురాలి భర్తకు స్పృహ లేకుండా చేసేవాడు. ఈ నేపథ్యంలో ఓ రోజు ఉదయం అల్పాహారం తరువాత బాధితుడు రెస్ట్ తీసుకోవాలని భావించి పడుకుండి పోయాడు. 11 గంటల సమయంలో భార్య నుంచి ప్రియుడికి కబురు వెళ్లింది. ఎప్పటిలానే అమ్మాయిలా దుస్తులు ధరించి వచ్చిన మెహతా, ఆమె భర్త నిద్రిస్తున్నాడని భావించి, మత్తుమందు వాసన చూపేందుకు దగ్గరికి వచ్చాడు. ఉలిక్కిపడి లేచిన బాధితుడు తొలుత దోపిడీ కోసం దొంగలు వచ్చారని భావించి, మీరెవరు? ఏం కావాలి? ఎందుకు వచ్చావు? అని ప్రశ్నించాడు.

దీంతో బిత్తరపోయిన మెహతా, అతనిపై దాడికి దిగాడు. ఆపై ఎదురుదాడికి దిగిన బాధితుడు మెహతాను నిలువరించడానికి ప్రయతించడంతో, తప్పించుకునేందుకు మెహతా మరో బెడ్ రూములోకి పరుగెత్తి లోపలి నుంచి తలుపు వేసుకున్నాడు. అతను ఎవరన్న ప్రశ్నకు తన భార్య నుంచి తెలియదన్న సమాధానం వచ్చింది. ఈలోగా తలుపు తీసుకుని బయటకు వచ్చిన అతను పరుగు లంఘించుకున్నాడు. నైటీలోనే పారిపోతున్న అతన్ని చూసిన బాధితుడు, వచ్చింది మెహతానేనని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ కేసులో శనివారం నాడు మెహతాను అరెస్ట్ చేశామని, అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, అతన్నుంచి క్లోరోఫాం, చినిగిన గౌను తదితరాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. సినిమాటిక్ గా బయటపడ్డ ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి స్థానికంగా సంచలనం రేపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pune  Nightie man  drug husband  Wife illegal Affair  

Other Articles

Today on Telugu Wishesh