హైదరాబాద్ స్టార్ హెటల్ లో ఫైర్ యాక్సిడెంట్.. | Fire breaks out in Hotel Katriya Somajiguda.

Fire accident in katriya hotel at somajiguda

Katriya Hotel, Hotel Katriya, Katriya fire accident, Katriya Hotel Hyderabad, Hotel Katriya, Katriya Hotel accident

A fire broke out in a four-star hotel here on Tuesday morning. No casualties were reported, police said. The fire broke out on the fourth floor of Katriya Hotel on Raj Bhavan Road.

ITEMVIDEOS:హోటల్ కత్రియాలో భారీ ఫైర్ యాక్సిడెంట్

Posted: 01/10/2017 01:32 PM IST
Fire accident in katriya hotel at somajiguda

హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో అగ్రిప్రమాదం జరగటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సోమాజీగూడ‌లోని హోట‌ల్ క‌త్రియాలో మంగ‌ళ‌వారం ఉద‌యం భారీగా మంటలు చెలరేగాయి. రాజ్ భవన్ కు సమీపంలోని 9 అంతస్థులు ఉన్న ఈ హోట‌ల్‌లోని నాలుగో అంత‌స్తులో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగ‌సిప‌డ్డాయి.

స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది హోట‌ల్ వ‌ద్ద‌కు చేరుకుని మూడు ఫైరింజ‌న్ల‌తో మంట‌లు అదుపు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తొలుత కారణాలు తెలియదన్న అధికారులు కాసేపటికే షార్ట్ సర్క్యూట్ తో జరిగిందని తేల్చారు. ఈ ప్ర‌మాదంలో ల‌క్ష‌ల రూపాయ‌ల విలువ చేసే ఫ‌ర్నిచ‌ర్ కాలి బూడిదైంది. అయితే ప్రాణ‌నష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ సమయంలో 50 మంది హోటల్ లో బస చేసినట్లు తెలుస్తోంది. హఠాత్తుగా హోటల్ లో మంటలు వ్యాపిండడంతో బస చేసిన వారు భయాందోళనలకు గురయ్యారు. సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించారు.

నాలుగో అంతస్థులో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఇతర అంతస్థులకు కూడ వ్యాపించాయి.కాగా, ఘటనపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తూ విచారణలో గనుక నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hotel Katriya  Hyderabad  fire accident  

Other Articles

Today on Telugu Wishesh