ప్రధానిపై ఫత్వా.. ఏ దేశంలోనైనా జరీ అవుతుందా..? BJP demands immediate arrest of Kolkata imam

Bjp demands immediate arrest of kolkata imam for issuing fatwa against pm modi

fatwa against PM, demonetisation, Narendra Modi, shahi imam of kolkata, PM Modi, trinamul congress, mamata banerjee, west bengal

The BJP in West Bengal has lodged a police complaint against a imam of Kolkata for issuing a 'fatwa' against Prime Minister Narendra Modi and demanded his immediate arrest.

ప్రధానిపై ఫత్వా.. ఏ దేశంలోనైనా జరీ అవుతుందా..?

Posted: 01/08/2017 05:53 PM IST
Bjp demands immediate arrest of kolkata imam for issuing fatwa against pm modi

దేశం నుంచి అవినీతిని, నల్లధనాన్ని పారద్రోలేందుకు ప్రధన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేస్తూ సాహసోపేత చారిత్రక నిర్ణయం తీసుకోగా, దాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని హోదాలో వున్న వ్యక్తిపై ఫత్వా జారీచేయడంపై బీజేపీ మండిపడింది. బీజేపీ జాతీయ సెక్రటరీ సిద్ధార్థ్ నాథ్ సింగ్  సయాద్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫత్వా జారీ చేసినప్పుడు తృణమూల్ ఎంపి   ఇద్రిస్ ఆలీ  సయాద్ పక్కన కూర్చుని ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ఏ దేశంలోనైనా జరుగుతాయా..? ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తులను దేశద్రోహులుగా ఎందుకు పరిగణించకూడదని బీజేపి ప్రశ్నించింది.

పెద్దనోట్ల రద్దుతో పేదలన్ని కష్టల్లోకి నెట్టాశారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ అయింది. దేశంలో డీమానిటైజేషన్  ప్రభావాల్ని  ఖండించిన  కోలకతా లోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్ ప్రధానికి వ్యతిరేకంగా ఆదివారం 'ఫత్వా' జారీ చేసింది. సమాజాన్ని,  అమాయక ప్రజల్ని మోదీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రిగా కొనసాగాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు.  మహ్మద్ నురూర్ రెహమాన్ బార్కాతి అని పిలిచే  షాహి ఇమామ్ సయ్యద్  పెద్దనోట్ల రద్దు తర్వాత  ప్రతీరోజు ప్రజలు వేధింపులకు గురయ్యారని, తీవ్ర బాధలు పడుతున్నారని ఆరోపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles