మహిళలను కించపర్చేలా స్వామీజీ వివాదాస్పద వ్యాఖ్యలు Omji Maharaj says women attract sexual predators if not fully covered

Omji maharaj says women are sensual beings will attract sexual predators if not fully covered

Swami Omji Maharaj, Omji Maharaj controversy, Omji Maharaj controversial remarks, Omji Maharaj bigg boss, Rahul Kanwal, Rahul Kanwal blasts Omji Maharaj

Swami Omji Maharaj said, that women are sensual beings, and if their bodies are not fully covered, will attract sexual predators like jaggery attracts flies.

మహిళలను కించపర్చేలా స్వామీజీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted: 01/08/2017 05:18 PM IST
Omji maharaj says women are sensual beings will attract sexual predators if not fully covered

అడవారు అర్థరాత్రి ఒంటరిగా తిరిగగలిగినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అంటూ జాతీపిత గాంధీజీ చేసిన వ్యాఖ్యలను మర్చిపోయే.. తాము స్వయంగా దేవుడి ప్రతిరూపాలమని చెప్పుకునే స్వామీజీలు మహిళలను కించపరుస్తూ అవమానకర వ్యాక్యలు చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతూ.. ఛీఫ్ పబ్లిసిటీకి పాకులాడుతున్నారు. ఈ జాబితాలో హిందూ మహాసభ అధ్యక్షుడైన స్వామి ఓంజీ మహరాజ్ కూడా చేరిపోయారు. న్యూస్‌రూం అనే ప్రైమ్‌టైమ్ షోలోని ప్యానలిస్టులలో ఒకరైన ఈయన... మన దేశంలో మహిళలు ధరిస్తున్న దుస్తుల వల్లనే వారిమీద లైంగిక దాడులు జరుగుతున్నాయని అన్నారు.
 
పొట్టి స్కర్టులు వేసుకోవడం వల్ల వాళ్లు ఇబ్బందులను కొనితెచ్చుకుంటున్నారని, బురఖాలో ఉన్నవాళ్లయితే సురక్షితంగా ఉంటారని చెప్పుకొచ్చారు. అమ్మాయిలు ఒంటినిండా దుస్తులు కప్పుకోకపోతే.. బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా లైంగిక దాడులు చేసేవాళ్లు వాళ్ల చుట్టూ చేరుతారని హెచ్చరించారు. బెంగళూరులో కొత్త సంవత్సరం రోజున జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు తీవ్రంగా మండిపడుతున్న తరుణంలోనే ఈయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
 
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అబు అజ్మీ కూడా దాదాపు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ''పెట్రోలు ఉంటే మంట వస్తుంది.. పంచదార ఉంటే చీమలు చేరుతాయి'' అని అమ్మాయిలే ఈ తరహా లైంగిక దాడులకు కారణమన్నట్లుగా ఆయన చెప్పారు. ఆధునిక కాలంలో ఎంతగా ఒళ్లు చూపిస్తే అంత ఫ్యాషన్ అని అమ్మాయిలు అనుకుంటున్నారని, డిసెంబర్ 31వ తేదీ సూర్యాస్తమయం అయిన తర్వాత సోదరుడు లేదా భర్త కాకుండా మరో మగాడితో తన సోదరి లేదా కూతురు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటుంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోనని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sexual attacks  omji maharaj  controversial comments  molestation  harrassment  

Other Articles