బంకుల్లో కార్డులు తీసుకుంటారా? లేదా? ] Petrol pumps threaten to stop accepting cards

Petrol pumps will accept cards for now as government steps in

Petrol pump, Cashless transactions, Petrol pump Credit debit cards, Banks' transaction fee, Petrol pumps threaten, Petrol bunks Card, Petrol pump plastic currency, Petrol Pumps protest

Petrol pumps threaten to stop accepting cards to protest banks' transaction fee later Government Steps In they make back step.

పెట్రోల్ బంకుల్లో కార్డు లావాదేవీలు ఆగలేదు

Posted: 01/09/2017 08:05 AM IST
Petrol pumps will accept cards for now as government steps in

నోట్ల రద్దు తర్వాత తీవ్ర కష్టాలను తీర్చేందుకు క్యాష్ లెష్ లావాదేవీలను కొనసాగిస్తున్న పెట్రోల్ బంకులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచి కార్డులను అంగీకరించేది లేదని ప్రకటించాయి. తొలుత అర్ధరాత్రి నుంచి తెలంగాణలోని పెట్రోల్ బంకుల్లో డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలు నిలిచిపోతాయని తెలిపాయి కూడా. అయితే చివరి నిమిషంలో ప్రభుత్వం నుంచి విజ్నప్తి రావటంతో ఆ నిర్ణయంను వాయిదా వేసినట్లు సమాచారం.

జనవరి 13 వరకు ఎలాంటి ఛార్జీలు విధించబోమని అధికారులు తెలపటంతో బంకు డీలర్లు కార్డు లావాదేవీలను కొనసాగించాలని నిర్ణయించాయి. కార్డుల చెల్లింపులపై వసూలు చేయాల్సిన అదనపు ఛార్జీలను డీలర్ల నుంచి వసూలు చేయాలని నిర్ణయించడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ పెట్రోలియం డీలర్స్ సంఘం కార్యదర్శి అమరమ్ రాజీవ్ తెలిపారు. డీజిల్ పై 2.5 శాతం, పెట్రోల్ పై 3.2 శాతం చొప్పున డీలర్లకు కమిషన్ వస్తుందని, అందులో నుంచి అదనపు ఛార్జీలుగా 1 శాతం వసూలు చేయాలని నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు.

తమ లావాదేవీల్లో అధిక శాతం కార్డుల ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు. ఇలాంటప్పుడు అదనపు ఛార్జీలు డీలర్ల వద్ద వసూలు చేస్తామంటే ఎలాగని ప్రశ్నించారు. కాగా, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను బంకుల్లో అనుమతించమన్న విషయాన్ని వినియోగదారులకు తెలియజేస్తూ ఆయా పెట్రోల్ బంకుల్లో బ్యానర్లు వెలిశాయి. దీంతో తమ నగదు రహిత లావాదేవీల లక్ష్యంపై తీవ్ర ప్రభావం పడనుందని గ్రహించిన ప్రభుత్వం నిర్ణయంను 13 వరకు వాయిదా వేయటంతో డీలర్లు వెనక్కి తగ్గారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol pump  Cashless transactions  transaction fee  protest  

Other Articles