వోడాపోన్ సూపర్ అవర్ అఫర్: గంటల తరబడి మాట్లాడండిక.. Vodafone gives unlimited 3g, 4g data for Rs 16 per hour

Vodafone superhour scheme gives unlimited 3g 4g data for rs 16 per hour

vodafone, vodafone superhour, vodafone offers, vodafone superhour price, vodafone unlimited data, vodafone 4g, vodafone, superhour, unlimited data, unlimited voice calling, vodafone unlimited 4g, vodafone unlimited voice calling, airtel, technology, technology news

Vodafone has announced a SuperHour scheme under which it will offer unlimited 3G or 4G data for one hour at Rs 16

వోడాపోన్ సూపర్ అవర్ అఫర్: గంటల తరబడి మాట్లాడండిక..

Posted: 01/07/2017 12:12 PM IST
Vodafone superhour scheme gives unlimited 3g 4g data for rs 16 per hour

టెలికాం రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులకు తోడు సహచర కంపెనీల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో తమ కస్టమర్లను కాపాడుకునేందుకు అన్ని సంస్థలు పోటాపోటీగా ఫథకాలను, బంపర్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. దేశంలో ఏకంగా 20 కోట్ల మంది కస్టమర్లను తమ సంస్థలో చేర్చుకోవాలని లక్ష్యాన్ని పెట్టుకుని దానిని అధిగమించిన రిలయన్స్ జియో సంస్థ ఉచిత ఆఫర్లు మిగతా నెట్ వర్క్ సంస్థలకు కంటిమీద కునుకును కరువు చేసింది. ఈ తరుణంలో వొడాఫోన్ కూడా తన ప్లాన్ లలో కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తోంది.

ఇప్పటికే వొడాఫోన్ రెడ్ లో మార్పులు చేసిన ఈ కంపెనీ మరికొన్ని కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రీ పెయిడ్ వినియోగదారులకు 'సూపర్ అవర్' పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.16కే ఒక గంట పాటు ౩జీ లేదా 4జీ డేటా అందించే ప్లాన్ ను ప్రకటించింది. మరో పథకంలో రూ.7కే అన్ లిమిటెడ్ లోకల్ కాల్స్ ( వొడాఫోన్ టు వొడాఫోన్ ) ఒక గంటసేపు చెల్లుబాటు అయ్యేలా రూపొందించింది. ఈ పథకం కింద 2జీ వినియోగదారులకు రూ.5కే అన్ లిమిటెడ్ డేటా కూడా అందుబాటులో ఉండనుంది. ఒక రోజులో ఎన్నిసార్లు అయినా ( రోజుకి 24 సార్లు ) ఈ ప్రీ పెయిడ్ ప్లాన్స్ కొనుక్కొని అపరిమిత డేటా పొందవచ్చు.

ఈ కొత్త పథకాలన్నీ వొడాఫోన్ ఇవాళ్లి నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త పథకాలు జమ్మూ-కశ్మీర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ లలో అందుబాటులో లేదని, జనవరి 9 నుంచి అన్ని సెక్టార్లలో అందుబాటులోకి వస్తాయని వొడాఫోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సందీప్ కటారియా తెలిపారు. అయితే సర్కిళ్ళను బట్టి ధరల్లో తేడా ఉండవచ్చని, నామమాత్రపు ధరకు ఒక గంటలో ఇష్టమైనంత ఎక్కువ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చని, 2017 మార్చి 31 వరకు ఉచితంగా అందుబాటులో ఉన్న వొడాఫోన్ ప్లే సబ్ స్క్రిప్షన్ లో, అపరిమిత డేటా ఆఫర్ తో వీడియోలు, సినిమాలు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vodafone  superhour  unlimited data  unlimited voice calling  airtel  technology  

Other Articles