అన్ని గమనిస్తున్నానని జోకు చేసిన ప్రధాని ramakrishna fires on kamineni, supports pawan kalyan on uddanam kidney issue,

Ramakrishna supports pawan kalyan on uddanam kidney issue fires on kamineni

CPI Andhra Pradesh secretary, cpi ap secretary, ramakrishna, cpi, pawan kalyan, jana sena, uddanam kidney patients, ichchapuram, srikakulam, andhra pradesh, political news

CPI Andhra Pradesh secretary K Ramakrishna stands in support of Jana Sena chief Pawan kalyan on Udhanam issue, demanding AP government to solve the problem

వవన్ కు మద్దతుగా రామకృష్ణ.. కామినేనిపై ఫైర్

Posted: 01/07/2017 11:17 AM IST
Ramakrishna supports pawan kalyan on uddanam kidney issue fires on kamineni

దశాబ్దాలుగా వున్న ఉద్ధానం కిడ్నీ సమన్యను పరిష్కారించడంలో గత ప్రభుత్వాలు ఘోరంగా విఫలయమ్యాయని.. ఇక ఈ సమస్యపై 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కామినేని చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ సిపిఐ కార్యదర్శి కె. రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాన్ చేసిన డిమాండ్లలో న్యాయం ఉందని రామకృష్ణ బాసటగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించ లేకపోవడం అన్యాయమనన్నారు.

పవన్ కల్యాణ్ గొంతెమ్మ కోర్కెలంటూ వ్యాఖ్యానించిన కామినేనిపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక విమానాలలో విదేశీయానాలు చేసేందుకు కోట్ల రూపాయలను తగిలేస్తున్న ప్రభుత్వం.. తమను ఎన్నుకున్న ప్రజల అరోగ్యాల కోసం మాత్రం వంద కోట్ల రూపాయలను ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. రైతుల దీనావస్థలు, ఆత్మహత్యలు, ప్రబలుతున్న వ్యాధుల గురించి పట్టించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేయడమే చంద్రబాబు చెబుతున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిదర్శనమా అని ఆయన ప్రశ్నించారు.

శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది కిడ్నీ బాధితులున్నారని.. వారిని రోగ విముక్తులు చేయడానికి నిధులను కేటాయించామని కోరితే అవి అమెదయోగ్యం కానివిగా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని రామకృష్ణ దుర్మార్గమన్నారు. కిడ్నీ వ్యాధులకు గురై అనేకమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. కిడ్నీ బాధితులకు బస్‌పాస్‌లు ఇవ్వాలని, మండలానికొక నెఫ్రాలజీ డాక్టర్‌ను నియమించమనీ, 100 కోట్ల రూపాయలను కేటాయించమని పవన్ క ల్యాణ్ అడిగితే దానికి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. పవన్‌వి గొంతెమ్మ కోర్కెలన్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ అదెట్లా సాధ్యమవుతుందని మాట్లాడటం సరైంది కాదన్నారు. ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించటం ఎంతవరకు సమంజసమని రామకృష్ణ నిలదీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh