చంద్రబాబు సాయం వెంటనే పవన్ ట్వీట్లు | Pawan Kalya thanks to AP govt on Uddanam Issue

Pawan thanks tweets to chandra babu

Janasena, Pawan Kalyan tweets, AP CM Chandrababu Naidu, Uddanam Announcement, Pawan Kalyan Uddanam, Pawan Kalyan Chandrababu naidu, Janasena TDP, Uddanam Kidney Nephropathy, Uddanam Kidney Issue

Janasena Chief Pawan kalyan thanks to CM Chandrababu naidu over Uddanam Announcement.

మంత్రి కన్నా చంద్రబాబు బెటర్: పవన్ ట్వీట్లు

Posted: 01/07/2017 11:23 AM IST
Pawan thanks tweets to chandra babu

శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తీవ్రంగా ఉన్న కిడ్నీల బాధితుల గోడును ప్రభుత్వానికి వినిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు ముఖాముఖి జరిపి అక్కడి వేదనను కళ్లకు కట్టినట్లు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చూపించాడు. ఈ క్రమంలో డెడ్ లైన్ ఇవ్వటం, ఆపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు కూడా స్పందించి ఉద్దానం బాధితుల‌కు అండగా నిలుస్తామని ప్రకటించటం చూశాం.

ఇక నిన్న చంద్రబాబు ప్రకటించిన సాయం పట్ల ఈ రోజు ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా స్పందించారు. బాధితుల స‌మ‌స్య తీవ్ర‌త‌ను జిల్లా నేత, మంత్రి అయినా కింజారపు అచ్చెంనాయుడు కన్నా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అర్థం చేసుకున్నారంటూ అందులో తెలిపాడు. బాధితుల స‌మ‌స్య‌పై స్పందిస్తూ చంద్ర‌బాబు చేసిన ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తిస్తున్నామ‌ని పేర్కొన్నారు. క‌ష్టాలు ఎదుర్కుంటున్న ఆ బాధితుల స‌మ‌స్య‌ల‌పై స్పందించ‌డం అన్ని పార్టీల బాధ్య‌త అని పవన్ కల్యాణ్ అన్నాడు. వారి స‌మ‌స్యలు పూర్తిగా తొల‌గిపోవ‌డం కోసం ఏపీలోని అన్ని రాజ‌కీయ పార్టీలు స్పందిస్తూనే ఉండాల‌ని కోరాడు.

రాష్ట్ర‌ ప్ర‌భుత్వం చేసిన ప్ర‌క‌ట‌న ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డానికి ప‌డిన‌ మొద‌టి అడుగుగా అభివ‌ర్ణించారు. కళింగ లేదా ఉత్తరాంధ్రకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా తాము అండగా జనసేన ఉంటుందని తెలిపాడు. నిస్స‌హాయులుగా ఉన్న బాధితుల ప‌క్షాన నిల‌బ‌డి వారి స‌మ‌స్య‌ల‌ను వివ‌రించ‌డానికి కృషి చేసిన మీడియాకు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నాడు. వారికి మీడియా స‌పోర్ట్ ఇలాగే కొన‌సాగాల‌ని ఆయ‌న ఆకాంక్షించాడు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  TDP  Chandrababu Naidu  Uddanam Announcement  

Other Articles

Today on Telugu Wishesh