కళ తప్పిన శశికళ పుష్ప.. చేతులు కాల్చుకుంది.. No CBI inquiry into Jayalalithaa's death, SC rejects MP's petition

Supreme court dismisses sasikala pushpa s plea seeking cbi probe into jayalalithaa s death

Jayalalithaa death, Sasikala Pushpa, V.K. Sasikala, CBI, AIADMK, Supreme Court

Pushpa had filed a writ petition in the Supreme Court earlier on Sunday urging the apex court to order for CBI probe into the 'mysterious and suspicious' death of Jayalalithaa

కళ తప్పిన శశికళ పుష్ప.. చేతులు కాల్చుకుంది..

Posted: 01/05/2017 12:47 PM IST
Supreme court dismisses sasikala pushpa s plea seeking cbi probe into jayalalithaa s death

అన్నాడీఎంకే బహిష్కృత పార్లమెంటు సభ్యురాలు శశికళ పుష్పకు చేతులు కాల్చుకుంది. అమ్మ తరువాత అంతా చిన్నమ్మేనని పార్టీలో ప్రచారం జోరందుకోవడం.. ఇప్పటికే చిన్నమ్మ పార్టీ పగ్గాలను కూడా అందుకున్న తరుణంలో.. ఇక రేపే మాపో ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించేందుకు పావులు కదుపుతుంది. ఈ పరిణామాలను జీర్ణంచుకోలేక శశికళా పుష్ప.. అమ్మ మృతిపై చిన్నమ్మను టార్గెట్ చేసింది. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శి పిఠాన్ని కూడా అధిరోహిస్తానని, అందుకు తాను పోటీలో నిల్చుంటానని చెప్పడం.. ఆ నేపథ్యంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన అమె భర్తను చిన్నమ్మ అనుయాయువులు దాడి చేయడం తెలిసింది.

అయినా.. పట్టువీడని, బెట్టు వదలని శశికళా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనుమానాలున్నాయని, ఆమె మృతిపై సీబీఐతో విచారించేలా ఆదేశించాలంటూ ఏకంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అశ్రయించారు. కాగా, ఆమె దాఖలు చేసిన పిటిషన్‌కు అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. అంతేకాదు.. ఇలాంటివాటితో మరోసారి పిటిషనర్లు బలవంతపెట్టి, న్యాయస్థానం సమయాన్ని వృధా చేయాలని ప్రయత్నిస్తే జరిమానా కూడా విధిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన హెచ్చరికలతో శశికళా పుష్ఫ చేతులు కాల్చుకున్నట్లు కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి పగ్గాలను అందుకోవాలని.. ఆ దిశగా అడుగులేస్తున్న శశికళ నటరాజన్ కు మాత్రం కలిసివచ్చినట్లైంది.

జయలలిత చుట్టూ జరిగే అనేక సంఘటనలకు శశికళ కుటుంబ సభ్యులే పాత్రధారులని, అన్నీ ఓ పథకం ప్రకారం జరిగాయని, ఆమె మృతిపై పలువురికి అనుమానాలున్నాయని ఆరోపిస్తూ శశికళ పుష్ప సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణ లేదా.. జ్యూడీషియల్‌ విచారణ జరగాలని ఆమె పిటిషన్‌లో కోరారు చేశారు. జయలలిత ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి చనిపోయేవరకు జరిగిన వైద్యం గురించి వివరణ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఆమెను చేర్పించిన ఆస్పత్రి నిరాకరించాయని కూడా ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa death  Sasikala Pushpa  V.K. Sasikala  CBI  AIADMK  Supreme Court  

Other Articles