ఓటర్లు అయోమయం.. అంచనాల్లో వ్యత్యాసం.. Opinion polls divided on Uttar Pradesh, Punjab elections

Opinion polls divided on 2017 election outcome in uttar pradesh punjab

UP elections, Punjab elections, Assembly election 2017, Opinion polls, Samajwadi Party, BSP, Akali Dal-BJP alliance, Punjab polls

Opinion polls were divided on the outcome of assembly elections in Uttar Pradesh and Punjab, with India Today-Axis predicting a big victory for the BJP in the country’s politically important state.

ఓటర్లు అయోమయం.. అంచనాల్లో వ్యత్యాసం..

Posted: 01/05/2017 01:56 PM IST
Opinion polls divided on 2017 election outcome in uttar pradesh punjab

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించగానే అందరి దృష్టి ముందుగా అత్యధిక అసెంబ్లీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ పై పడింది. అయితే ఇప్పటికే ప్రజలనాడిని తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించిన సర్వే సంస్థలు కూడా షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో తమ అంచనాల చిట్టాను విప్పాయి. గతంలో ఈ సర్వే సంస్థల అంచానాల మధ్య కొద్దిపాటి వ్యత్యాసం వుండేది. కానీ తాజాగా సర్వే సంస్థలు ప్రకటించిన ఒపీనియన్‌ పోల్స్‌ ఫలితాలు ఓటర్లను అమోమయానికి గురిచేస్తున్నాయి. ఎక్కడ ఏమాత్రం పోంతన లేకుండా సర్వే సంస్థలు అంచానాల చిట్టాను విడుదల చేయడంతో ఇదెలా సాధ్యం అని ఓటర్లు విస్మయానికి గురవుతున్నారు.

రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీకి సంపూర్ణమైన మెజారిటీ వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వే అంచనా వేయగా.. ఈ అంచనాతో ఏబీపీ న్యూస్‌ -లోక్‌నీత్‌ -సీఎస్‌డీఎస్‌ సర్వే విభేదించింది. యూపీలో పోటీ హోరాహోరీగా ఉంటుందని, ఉత్తర్ ప్రదేశ్ లో ప్రస్తుతం అధికార పార్టీయైన ఎస్పీకి మెజారిటీ స్థానాలు రావొచ్చునని, అఖిలేష్ పాలన మరో పర్యాయం కొనసాగవచ్చునని కూడా పేర్కొంది. రెండు సర్వే సంస్థలు విభిన్నమైన ఫలితాలను విడుదల చేయడంతో ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు.

ఫిబ్రవరి 11 నుంచి ఏడు దశలుగా ఎన్నికలు జరగనున్న యూపీ (403)లో బీజేపీ 206 నుంచి 216 అసెంబ్లీ స్థానాలు గెలుపొందుతుందని ఇండియా టుడే-యాక్సిస్‌ సర్వే అంచనా వేసింది. కుటుంబ పోరుతో సతమతమవుతున్న ఎస్పీకి 92-97 స్థానాలు, బీఎస్పీకి 79-85 స్థానాలు రావొచ్చునని పేర్కొంది. కాంగ్రెస్‌ 5-9 నుంచి స్థానాలతో సరిపెట్టుకుంటుందని తెలిపింది. పెద్దనోట్ల రద్దుకు ముందు బీజేపీకి యూపీలో 31శాతం ఓట్లు వచ్చే అవకాశముండగా.. నోట్లరద్దుతో మరింతగా కలిసివచ్చిందని, ఆ పార్టీకి వచ్చే ఓటుషేర్‌ డిసెంబర్‌లో 33శాతం పెరిగిందని ఈ సర్వే పేర్కొంది.

అయితే ఏబీపీ న్యూస్‌-లోక్‌నీత్‌-సీఎస్‌డీఎస్‌ సర్వే  ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ- ఎస్పీ మధ్య పోటీ హోరాహోరీగా ఉంటుందని అంచనా వేసింది. అధికార పార్టీ ఎస్పీకి ఎక్కువ అసెంబ్లీ స్థానాలను సంపాదించే అవకాశముందని అంచనా వేసింది. ముఖ్యమంత్రి అఖిలేష్ పాలన బాగుందని, ఈ పాటనను మరోమారు కొనసాగాలని ప్రజలు అశిస్తున్నారని పేర్కొంది. అధికార పార్టీ సమాజ్ వాదీకి 141-151 సీట్లు, బీజేపీకి 129-139 సీట్లు, బీఎస్పీకి 93-103 సీట్లు, కాంగ్రెస్‌కు 13-9 సీట్లు రావొచ్చునని తెలిపింది.

ఇక పంజాబ్‌ విషయంలోనూ సర్వేల ఫలితాల్లో పోలిక లేదు.  ఏబీపీ న్యూస్‌-లోక్‌నీత్‌-సీఎస్‌డీఎస్‌ సర్వే పంజాబ్‌లో అధికార శిరోమణి అకాలీ దళ్‌ (ఎస్‌ఏడీ)-బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీల మధ్య హోరాహారీ ఉంటుందని, ఎస్‌ఏడీ-బీజేపీ మిత్రపక్షాలకు 50-58 సీట్లు, కాంగ్రెస్‌కు 41-49 సీట్లు రావొచ్చునని పేర్కొంది. ఆప్‌ 12-18 సీట్లు గెలుచుకోవచ్చునని పేర్కొంది. అయితే ఇండియా టుడే యాక్సిస్‌ సర్వే మాత్రం కాంగ్రెస్‌-ఆప్‌ మధ్య పోటీ ఉంటుందని, కాంగ్రెస్‌కు 49-55 సీట్లు, ఆప్‌కు 42-46 సీట్లు వస్తాయని, ఎస్‌ఏడీ-బీజేపీకి 17-21 సీట్లు వచ్చే అవకాశముందని పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles