ఇప్పుడు రూ. 2000 వేల నోట్ల వంతు వచ్చిందోచ్..! MP Farmers Given Rs 2,000 Notes Without The Gandhi Image

Bank dispenses rs 2000 notes sans gandhi pic says they aren t fake

Demonetisation, Mahatma Gandhi watermark, new 2000 rupee note, New notes, Sheopur, state bank of India, 2000 notes, New currency, Union government, mistakes, reserve bank of india, printing error, bhopal, madhya pradesh

Two elderly farmers in Madhya Pradesh’s Sheopur district got a shock after being handed Rs 2000 notes without the customary picture of Mahatma Gandhi

ఇప్పుడు రూ. 2000 వేల నోట్ల వంతు వచ్చిందోచ్..!

Posted: 01/05/2017 10:34 AM IST
Bank dispenses rs 2000 notes sans gandhi pic says they aren t fake

దేశ ప్రజలకు అవసరమైన కరెన్సీ పైన అవగాహన లేకుండా, ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా కేంద్రం పాత పెద్ద నోట్లను రద్దు చేసిందన్న విమర్శలు పెద్ద ఎత్తున్న వినిపిస్తున్న తరుణంలో వాటిని తిప్పికోట్టేందుకు ఆర్బీఐ కొత్త కరెన్సీ నోట్లను తిప్పికొట్టేందుకు ఎంతగానో ప్రయత్నించింది. ముందుగా రెండు వేల రూపాయల నోట్లను తీసుకువచ్చిన కేంద్రం.. ఆ తరువాత తమ అధ్వర్యంలో కొత్త 500 రూపాయల నోట్లను ఇతర ప్రైవేటు ప్రాంతాల్లో ముద్రించింది. అయిదే వాటిని ముద్రించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించకపోవడంతో 500 నోట్లలో తప్పులు దోర్లడం.. దాంతో తీవ్రమైన విమర్శలను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కోవడం జరిగింది.

ఆ తరువాత ఇప్పుడు తాజాగా రెండు వేల రూపాయల నోట్లు వంతు వచ్చింది. కొత్త కరెన్సీ నోట్లను ముద్రించడంలో రాత్రింబవళ్ళు పనిచేస్తున్న అర్భీఐ సిబ్బంది.. తమకు అరోగ్య సమస్యలు వస్తున్నాయని చెబుతున్నా.. దేశ ప్రజల అవసరాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వహించాలని కేంద్రం వారిని సముదాయించినా.. తప్పులను మాత్రం జరగకుండా కాపాడలేకపోయింది. దీంతో జాతిపిత మహాత్మాగాంధీ బొమ్మ లేకుండా కొత్త రెండు వేల రూపాయల నోట్లు ముద్రించారు. అవును ఈ నోట్లు కూడా బ్యాంకుకు రావడం.. అక్కడి నుంచి రైతులకు వెళ్లడం తిరిగి రైతుల నుంచి బ్యాంకు రావడం కూడా జరిగిపోయింది.

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌ జిల్లాలోని ఓ ఏజెన్సీ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లి రూ.2000 నోట్లు తీసుకున్నారు. అయితే, తొలుత కొత్త నోట్లేగా చూసుకోవాల్సిన పనేముందనుకొని ఇంటికెళ్లారు. అనంతరం చూసుకోగా వాటిపై గాంధీ బొమ్మ కనిపించలేదు. దీంతో అవి దొంగనోట్లు అనుకొని తిరిగి బ్యాంకు వద్దకు తీసుకురాగా వాటిని తనిఖీ చేసిన అధికారులు అవి దొంగనోట్లు కాదని, ఆర్‌బీఐ నోట్లేనని, వాటిని తీసుకొని తిరిగి వారికి వేరే నోట్లు ఇచ్చారు. ముద్రణ లోపం కారణంగా తప్పు జరిగి ఉంటుందని వారు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles