నిరుద్యోగులకు అక్కడ ఇక జేబు నిండా డబ్బు | Finland Starts Handing Out a Basic Income.

Finland introduces basic income for unemployed

Finland, basic income plan, Finland Unemployment, jobseekers wage, Basic Income to employees, Universal Basic Income, 2000 unemployed people, Finland new scheme

European Country Finland launches two-year experiment in basic income for the unemployed. First country to pay the unemployed a fixed income.

పని లేకున్నా పైసలు మీ జేబులోకి...

Posted: 01/05/2017 10:55 AM IST
Finland introduces basic income for unemployed

ఒకదేశం వెనకబాటు తనానికి, ఆర్థికంగా ఎదుగుదల లేకపోవటానికి నిరుద్యోగం కూడా ఓ కారణంగా చెప్పొచ్చు. ఇదే ప్రధాన కారణం అని చెప్పకపోయినప్పటికీ, పని పాట లేకుండా ఖాళీగా తిరిగే బాబులు ఈజీ మనీ కోసం క్రైమ్ లకు పాల్పడుతుంటం మాత్రం చూస్తున్నదే. ఈ దశలో తమ దేశంలో ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు స్విట్జర్ లాండ్ ప్రేరణతో ఫిన్ లాండ్ ఓ అరుదైన నిర్ణయం తీసుకుంది.

నిరుద్యోగుల కోసం అక్కడి ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం అక్కడి నిరుద్యోగులకు ప్రతి నెలా 560 యూరో డాలర్లను(మన కరెన్సీలో అక్షరాల 40 వేలు) ఉచితంగా ప్రభుత్వం ఇస్తుంది. ఇంత మొత్తం సొమ్మును వారికి ప్రతినెలా ఇస్తేనే ఆ దేశంలో కనీస సౌకర్యాలు లభిస్తాయి. తద్వారా నేరాలను, పేదరికాన్ని, మెల్లిగా నిరుద్యోగాన్ని కూడా పారద్రోలచ్చేనేది ఆలోచన.

గతేడాది దీనిపై ఓటింగ్ నిర్వహించగా మెజార్టీ ప్రజలతోపాటు, ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా కూడా ప్రభుత్వం దీనిని అమలు పరిచేందుకు సిద్ధమైపోయింది. ఇదిలా ఉండగా, ఈ పథకంపై కొందరు పెదవి విరుస్తున్నారు. దీనివల్ల నిరుద్యోగులు సోమరిపోతులవుతారని విమర్శిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ పథకంతో నిరుద్యోగులు మరిన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారని ఆశిస్తున్నారు. ఈ పథకాన్ని తొలి దశలో రెండు వేల మంది నిరుద్యోగులకు మాత్రమే పరిమితం చేయనున్నామన్నారు.

ఇందులో ఉన్న మరో బంఫరాఫర్ ఏంటంటే... పథకం ద్వారా లబ్ధి పొందుతున్న నిరుద్యోగులకు ఎక్కడైనా ఉద్యోగం లభిస్తే కనుక, ఈ ప్రయోజనాన్ని వదలుకోవాల్సిన అవసరం లేదు. కానీ, స్వచ్ఛందంగా వద్దని అనుకుంటే మాత్రం ఆ ప్రయోజనాన్ని వదులుకోవచ్చు. 2019 వరకు ప్రయోగాత్మకంగా ఇది అమలు కానుంది. ఇంతకు ముందు ఇటలీ, కెనడాలో కూడా ఇటువంటి ప్రయోగం అమలు చేయగా, అది సత్ఫలితాలను ఇవ్వటం విశేషం. 5.5 మిలియన్ జనాభాతో, 8.1 శాతం నిరుద్యోగ శాతం ఉన్న ఫిన్ లాండ్ లో ఈ ప్రయోగం కూడా ఫలించొచ్చనే అర్థిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Finland  Universal Basic Income  Unemployed  

Other Articles