ఎంసెట్‌ లీకేజీ ప్రధాన నిందితుడు అనుమానస్పద మృతి | EAMCET leakage scam convict died.

Eamcet scam convict kamileshwar died

Eamcet leakage, Kamaleshwar, Eamcet Kamaleshwar, EAMCET scam 2016, EAMCET Kamileshwar , Eamcet most wanted died, Eamcet convict suspicious death, Eamcet scam, EAMCET convict death, Telangana CID convict death

Telangana EAMCET leakage scam convict Kamileshwar died due to heart attack.

ఎంసెట్ స్కాం కీల‌క నిందితుడు మృతి

Posted: 01/05/2017 09:08 AM IST
Eamcet scam convict kamileshwar died

ఎంసెట్ స్కాంలో కీల‌క నిందితుడు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందాడు. ఎంసెట్ 2 ప్ర‌శ్న‌ప‌త్రం లీకేజీ కేసులో మోస్ట్ వాంటెడ్ అయిన క‌మిలేశ్వ‌ర్ బీహార్ రాజ‌ధాని పాట్నాకు చెందిన‌వాడు. అస్వస్థతతో రెండు రోజుల క్రితం గుండెపోటుతో ఉస్మానియా ఆస్ప‌త్రిలో చేరిన ఆయ‌న చికిత్స పొందుతూ మృతిచెందిన‌ట్టు సీఐడీ అధికారులు తెలిపారు. అయితే నిందితుడి మృతదేహానికి ఆస్ప‌త్రిలో గుట్టుచ‌ప్పుడు కాకుండా పోస్టుమార్టం నిర్వ‌హించ‌డం అనుమానాలకు తావిస్తోంది.

ఎంసెట్ స్కాంలో ఇద్ద‌రు ప్ర‌ధాన నిందితుల‌ను తెలంగాణ సీఐడీ నాలుగు రోజుల క్రిత‌మే పాట్నాలో అదుపులోకి తీసుకుంది. అక్క‌డి కోర్టులో హాజ‌రు ప‌రిచి ట్రాన్సిట్ వారెంట్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చి ఇక్క‌డి సీఐడీ కోర్టులో ప్ర‌వేశపెట్టారు. అనంత‌రం అదుపులోకి తీసుకున్నారు. విచార‌ణ స‌మ‌యంలో నిందితుడు క‌మిలేశ్వ‌ర్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆస్ప‌త్రిలో చేర్చామ‌ని అధికారులు తెలిపారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం గుండెపోటు రావ‌డంతో ఆయ‌న మృతి చెందిన‌ట్టు పేర్కొన్నారు.

పోలీసు క‌స్ట‌డీలో ఉన్న వ్య‌క్తి అక‌స్మాత్తుగా మృతి చెంద‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. అత‌డి ప‌రిస్థితి విష‌మిస్తున్నా స‌రైన వైద్యం అందించ‌క‌పోవ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఈ కుంభ‌కోణంపై ద‌ర్యాప్తు చేస్తున్న అధికారుల మెడ‌కు క‌మిలేశ్వ‌ర్ మృతి వ్య‌వ‌హారం చుట్టుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కాగా మృతి చెందిన క‌మిలేశ్వ‌ర్ ప‌ట్నాలో అడ్వొకేట్‌గా ప‌నిచేస్తున్న‌ట్టు స‌మాచారం.

కాగా, మృతిచెందిన కమిలేశ్వర్‌ నాలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌ అని సీఐడీ వర్గాలు తెలిపాయి. మెడికల్‌ ప్రశ్నపత్రాల లీకేజీలో అతను ఆరితేరాడని, కర్ణాటక, బిహార్, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పలు పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌ కేసుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడని అధికారుల ద్వారా తెలిసింది. ప్రతీ రాష్ట్రంలో మెడికల్, ఇతరత్రా కీలక ఎంట్రన్స్‌ పరీక్షల సమయంలో తన మనుషులను వర్సిటీలు, ప్రశ్నపత్రాలు ప్రింటింగ్‌ చేసే ప్రెస్‌లో దింపుతాడని.. వారి ద్వారా ప్రశ్నపత్రం లీక్‌ చేయడం, విద్యార్థులకు ఎరవేసి భారీగా డబ్బులు వసూలు చేసేవాడని సీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం సీఐడీ చేస్తున్న దర్యాప్తులో 210 మంది విద్యార్థులకు నిందితులు మొత్తం ప్రశ్నపత్రం లీక్‌ చేసినట్టు ఆధారాలు దొరికాయని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  EAMCET 2016  leakage scam  convict  Kamileshwar  death  

Other Articles

Today on Telugu Wishesh