కస్టమర్లకు షాక్.. సర్వీస్ టాక్స్ తప్పనిసరంటున్న ఎన్ఆర్ఏఐ NRAI says service tax is mandatory just like vat

Nrai says service tax is mandatory just like vat

Service tax, Riyaaz Amlani, NRAI, National Restaurant Association of India, Hotel Association of India, Department of Consumer Affairs, Amlani

The decision of the Department of Consumer Affairs to make levy of service charge optional or discretionary will affect around 8.5 million employees associated with the food service industry, said Riyaaz Amlani, the President of NRAI

కస్టమర్లకు షాక్.. సర్వీస్ టాక్స్ తప్పనిసరంటున్న రెస్టారెంట్లు

Posted: 01/03/2017 03:21 PM IST
Nrai says service tax is mandatory just like vat

ఇన్నాళ్లు రండి బాబు రండీ అంటూ అప్యాయతగా పిలిచిన హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇక సర్వీసు టాక్స్ చెల్లించడానికి సిద్దంగా వుంటేనే రండీ.. లేదంటే రాకపోయినా పర్వాలేదని తెగేసి చెబుతున్న రోజులోచ్చాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో భుజించేవారిపై ప్రస్తుతం ఐదు నుంచి 20 శాతం వరకు బిల్లులో సర్వీసు టాక్స్ రూపంలో వడ్డెన పడుతుంది. అయితే వాటిరి పెద్దగా పట్టించుకోకుండానే ఇప్పటివరకు బిల్లు ఎంతైతే అంత ఇచ్చేవాళ్లు.

దీనిపై పిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కస్టమర్లు హోటళ్లు, రెస్టారెంట్ల సర్వీసుతో సంతృప్తి చెందితే.. చెల్లించవచ్చు.. లేదా చెల్లించాల్సిన అవసరం లేదని తాజాగా వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. దీంతో ఇలా చేస్తే తమకు వచ్చే ఆదాయానికి గండి పడినట్లేనని, రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లు వ్యాట్ మాదిరిగానే సర్వీసు టాక్స్ కూడా భాగమని తెలుసుకుని రావాలని కోరుతున్నారు. లేని పక్షంలో తమ రెస్టారెంట్లకు రాకపోయినా పర్వాలేదని అంటున్నారు. ఇక దీనిపై మరికోందరు రెస్టారెంట్ల ఓనర్లు ప్రభుత్వం పన్నులు వదులుకోదు కానీ.. మమల్ని సర్వీసు టాక్స్ వదులుకోమ్మని ఎలా చెబుతుందని ప్రశ్నిస్తున్నారు.

చట్ట ప్రకారంమే తాము ఈ చార్జిలను వసూలు చేస్తున్నట్టు జాతీయ రెస్టారెంట్ల సంఘం అధ్యక్షుడు రియాజ్ అమ్లాని స్పష్టం చేశారు. చట్ట విరుద్ధంగా, అన్యాయంగా తాము వ్యవహరించడం లేదని వివరణ ఇచ్చారు. సర్వీస్ చార్జి  వసూళ్లను ఉద్యోగుల మధ్య సమానంగా పంపిణీ  చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. ఇది ఉద్యోగుల ఆదాయపన్ను చెల్లించడం, రెస్టారెంట్ల వ్యాట్ బిల్లులాంటి వాటిల్లో భాగమంటూ సర్వీస్ చార్జి వసూలు సమర్ధించుకున్నారు.

మరోవైపు ప్రభుత్వం తాజా ఆదేశాలకు బదులు సర్వీస్ చార్జ్ ను రద్దు చేసి ఉంటే బావుండేదని మరి కొంతమంది రెస్టా రెంట్ ప్రతినిధులు  అభిప్రాయపడ్డారు.  రెస్టారెంట్ అద్దెలు, మార్కెట్లో పోటీ ,  కార్మికుల జీతాలు పెరుగుతున్నాయని ప్రముఖ చెఫ్, మంకీ బార్ అవుట్ లెట్స్ ప్రతినిధి మనుచంద్ర వ్యాఖ్యానించారు. ఇపుడిక ఈ ఖర్చులకోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ నిట్టూర్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles