2030 నాటికి ఆ రంగంలోకి టాప్-3 లో భారత్ | India will be among top 3 countries in S&T by 2030.

Pm narendra modi speech at 104th indian science congress

PM Narendra Modi, 104th Indian Science Congress, Modi Indian Science Congress, Modi Speech At 104th Indian Science, Modi at Tirupati, Modi about science and technology, Narendra Modi Chandrababu Naidu

PM Modi to inaugurate 104th Indian Science Congress at Tirupati and hopes India will be among top 3 countries in S&T by 2030.

మోదీ మాట: టెక్నాలజీ కూడా మారాల్సిందే!

Posted: 01/03/2017 03:44 PM IST
Pm narendra modi speech at 104th indian science congress

వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, శాస్త్ర సాంకేతిక రంగం కూడా మారాల్సిన అవసరం ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతిలో ప్రారంభమైన 104వ భారత సైన్స్ కాంగ్రెస్ వేడుకలను ఆయన అట్టహసంగా ప్రారంభించారు. పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలతో పాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు ప్రారంభసభకు హాజరయ్యారు.

సవాళ్లను ఎదుర్కొంటూ భారత శాస్త్రవేత్తలు ముందుకు సాగుతున్నారని, వారికి తన అభినందనలని ప్రారంభోపన్యాసం సందర్భంగా మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందని, ప్రభుత్వం సైతం అధికంగా నిధులిచ్చి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. పర్యావరణంతో పాటు నీటి శుద్ధి రంగాలు ఎంతో కీలకంగా మారాయని, ఈ రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని, వీటి పరిష్కారానికి సైంటిస్టులు కదలాలని చెప్పారు. 12 కీలక రంగాలపై ప్రత్యేక దృష్టిని సాగించాల్సి వుందని, సైబర్, రోబోటిక్స్ రంగాలు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి వుందని పిలుపునిచ్చారు.

డిజిటల్ ఇండియా ద్వారా మాన్యుఫాక్చరింగ్ రంగ అభివృద్ధికి కృషి జరుగుతోందని నరేంద్ర మోదీ తెలియజేశారు. వాతావరణ మార్పులతో పాటు హాని చేసే సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రపంచాన్ని ముందుకు నడిపేలా మన శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని కోరారు. అందుకు వేసే ప్రతి అడుగుకూ తన మద్దతు ఉంటుందని తెలిపారు. సమాజ సాధికారతకు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలకు దేశ ప్రజలు కృతజ్ఞతతో ఉంటారని, దీర్ఘకాల ప్రయోజనాల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. యూనివర్శిటీలు, ఐఐటీలు, స్టార్టప్ సంస్థలు, మంత్రిత్వ శాఖలూ సమన్వయంతో పనిచేయాలని, 2030 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే మొదటి మూడు దేశాల్లో ఇండియా ఒకటిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

 

ఈ రంగాల్లో ల్యాబొరేటరీల నిర్వహణను మరింత సులభతరం చేయాల్సి వుందని, అందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులిచ్చి ప్రోత్సహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. పాఠశాలల స్థాయి నుంచే విద్యార్థుల ఆలోచనల మదింపు జరగాలని, కొత్త ఆలోచనలు విద్యార్థుల నుంచి వచ్చినప్పుడు, అధ్యాపకులే ప్రోత్సహించాలని కోరారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక విధానాలు వికసించేలా నీతి ఆయోగ్ పలు నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని, ఈ సదస్సు పలు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేశారు.

భవిష్యత్ అంతా టెక్నాలజీ పైనే-చంద్రబాబు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి రెండు అతిపెద్ద నిర్ణయాలను తీసుకున్నారన్నారు. భారత్ మానవ వనరుల కేంద్రంగా మారిందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే ఉంటున్నారని అన్నారు. భవిష్యత్ అంతా టెక్నాలజీ వినియోగంపైనే ఆధారపడి ఉంటుదన్న ఆయన, ఏపీలో బయోమెట్రిక్ పద్ధతిలో చౌకదుకాణాల నుంచి సరుకులు అందిస్తున్నామని, మొబైల్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నామని , నెలకు రూ.149 లకు ఫైబర్ గ్రిడ్ సేవలు తదితర అంశాలను ప్రస్తావించారు.

ఇక సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఉన్నారు.  

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Indian Science Congress  Tirupati  Prime Minister  Narendra Modi Speech  

Other Articles

 • Nirbhaya convict pawan gupta files curative petition in supreme court

  ‘నిర్భయ’ కేసు: సుప్రీంకోర్టును ఆశ్రయించిన దోషి పవన్ గుప్తా

  Feb 28 | దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో దోషులు మరోమారు శిక్ష నుంచి తప్పించుకున్నట్లేనా.? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులోని దోషులకు వేర్వేరుగా మరణ శిక్ష విధించాలని ఉద్దేశించిన పిటిషన్ పై... Read more

 • High court serious on mishandling chandrababu naidu in visakhapatnam

  చంద్రబాబును.. ఈ నోటీసుతో ఎలా అరెస్ట్ చేశారు.?: హైకోర్టు

  Feb 28 | మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉతన్నమైన పరిణామాలకు పోలీసుల నిర్లక్ష్యం కూడా తోడందైన్న విమర్శలు వినిపించాయి. సుమారు మూడున్నర గంటల పాటు కారులోనే కూర్చున్నా.. పోలీసులు అధికార వైసీపీ పార్టీ... Read more

 • Tension previals in amaravati as ycp activists rally continues in front of farmers protesting tents

  అమరావతిలో ఉద్రిక్తత: రైతుల శిభిరాల మీదుగా వైసీపీ ర్యాలీ..

  Feb 28 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపూర్ణ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 73వ రోజుకు చేరాయి. తాము ఏ ప్రాంత అభివృద్దికి వ్యతిరేకం కాదని.. అయితే అభివృద్ది వికేంద్రీకరణకు తామూ... Read more

 • Delhi woman delivers miracle baby hours after being attacked and kicked in the stomach by rioters

  సీఏఏ అల్లర్లు: మిరాకిల్ బేబికి జన్మనిచ్చిన యువతి

  Feb 28 | ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న రేగుతున్నఅల్లర్లు స్థానికులను భయాందోళనకు గురిచేసింది. అల్లర్ల మాటును అందోళనకారులు కనీసం తాము మనుషులం అన్న ఇంకితాన్ని కూడా మర్చిపోయారు. సీఏఏ చట్టానికి అనుకులమా.? వ్యతిరేకమా.?... Read more

 • Coronavirus in india us spy agencies monitor coronavirus spread concerns about india

  భారత్ కరోనా కట్టడిపై.. అందోళనలలో అగ్రరాజ్యం.!

  Feb 28 | ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌(కొవిడ్‌-19) వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో పలు దేశాలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకుంటున్నాయని అగ్రరాజ్యం అమెరికా అభిప్రాయపడింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థలు దీనిపై దృష్టి సారించాయని సంబంధిత... Read more

Today on Telugu Wishesh