సీఎం, ప్రతిపక్ష నేత ఎంజాయ్ వీడియో తెగ వైరల్ అవుతోంది | Meghalaya's CM, Oppn leader got together to sing video viral.

Meghalaya cm with opposition leader goes viral

Meghalaya, Meghalaya chief minister, Mukul Sangma sings, All my loving with opposition leader, Mukul Sangma Donkupar Roy, Chief Minister sing song, CM sing Beatles classic, CM Opposition leader get together, Chief Minister Video Viral

Meghalaya chief minister Mukul Sangma sings Beatles' hit song All my loving with opposition leader Donkupar Roy.

ITEMVIDEOS:సీఎం, ప్రతిపక్ష నేత వీడియో వైరల్

Posted: 01/03/2017 04:35 PM IST
Meghalaya cm with opposition leader goes viral

చట్ట సభల్లో మైకులు విరగొట్టుకోవడాళ్లు, ఇంట్లో వాళ్లను లాగీ మరి తీవ్ర పదజాలంతో దూషించుకోవటం, అర్థం పర్థం లేని విమర్శలు ఇవి మన దేశంలో రాజకీయాల్లో రాణించాలంటే నేతలకు కావాల్సిన కనీస లక్షణాలు. రాజ్యాంగంలోని లౌకిక వాదం అన్న పదంపై ప్రమాణం చేసి మరీ మత,కుల, జాతిపరమైన విమర్శలు చేయటం వారికి అలవాటు అయిపోయింది.

అయితే ఇక్కడ మీకో వీడియోను చూపించబోతున్నాం. ఈ వీడియో చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోవటం ఖాయం. ఇందులో కనిపించేంది ఎవరో కాదు. స్వయానా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్కన ఉంది ఎవరో తెలుసా? ప్రతిపక్ష నేత, ఆ పక్కన ఉంది మరో పార్టీ అధినేత. ప్రత్యర్థి పార్టీ అంటే విమర్శలు, ప్రతివిమర్శలతో టామ్ అండ్ జెర్రీ ఆట లాగా ఉండాలి కదా? ఇదేంటి వీళ్లు ఇలా పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.

మేఘాలయా ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా, ప్రతిపక్షనేత డాక్టర్ డోన్ కుపర్ రాయ్, యూడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పౌత్ లింగ్దో వీరంతా కొత్త సంవత్సరం వేడుకలను ఇలా కలిపే జరుపుకున్నారు. బీట్ లెస్ ఆల్ టైం హిట్ సాంగ్ ‘ఆల్ మై లవింగ్’ పాటను సంగ్మా ఆలపిస్తూ ఉంటే, మిగతా వారంతా ఆయనతో శృతి కలుపుతూ ఇలా ఊగిపోతూ కనిపిస్తున్నారు.

ఓవైపు ఒకే ఇంట్లో తండ్రి-కొడుకుల మధ్య అధికార కుంపటి రాజుకున్న వేళ(సమాజ్ వాదీ సంక్షోభం), ఇంకోవైపు సాటి రాష్ట్రంలో(అరుణా చల్ ప్రదేశ్) రాజకీయ చదరంగంతో రాజకీయ సంక్షోభం వైపు అడుగులు పడుతున్న వేళ, ఇలా ప్రత్యర్థులతో కలిసి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సేదతీరుతున్న ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సంగీతం దెబ్బకి పాము-ముంగిస పాట పాడుకోవటం అంటే ఇదేనేమో...

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Meghalaya  chief minister Mukul Sangma  Beatles' hit song  All my loving  Donkupar Roy  

Other Articles

Today on Telugu Wishesh