పెద్ద నోట్ల రద్దుపై రఘువీరా సంచలన వ్యాఖ్యలు Raghuveera reddy slams modi government over demonetisation

Raghuveera reddy slams modi government over demonetisation

Andhra pradesh PCC chief, Raghuveera Reddy, modi government, demonetisation, central government, note ban failure, congress foundation day, ananthapur

Andhra pradesh PCC chief Raghuveera Reddy slams modi government over demonetisation, says its central governments failure.

పెద్ద నోట్ల రద్దుపై రఘువీరా సంచలన వ్యాఖ్యలు

Posted: 12/28/2016 12:01 PM IST
Raghuveera reddy slams modi government over demonetisation

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు తరువాత వచ్చిన రెండు వేల రూపాయల నోట్లు.. ముందుగా దేశంలోని ప్రజలకు బదలుగా దేశంలోని నల్లధన కుబేరులకు చేరిపోయాయని అరోపించారు. నల్లధన కుబేరులకు, మోడీ అనుకూలరైన వారికి, బీజేపి ప్రముఖులకు పెద్ద సంఖ్యలో రెండు వేల రూపాయల నోట్లు ఎలా చేరారని ఆయన ప్రశ్నించారు.

అట్టు నల్ల కుబేరుల ఖాజానాలకు తరలివెళ్లిన నల్లధనం అంతకంటే వేగంగా తీవ్రవాదులకు చేరాయని అయన అరోపించారు. ప్రధాని చెప్పిన 50 రోజుల వ్యవధి ముగిసినా.. సామాన్యులకు డబ్బు విత్ డ్రా విషయంలో ఇంకా అనేక అవస్థలు పడుతూనే వున్నారన్నారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలను సంయమనం పాటించాలని, కొన్ని రోజులు కష్టాలు తప్పవని చెప్పిన ప్రధాని ఆయన ఇచ్చిన గడువు తీరన విషయం కూడా మర్చిపోయారా..? మరెందుకు ఇంకా సామాన్యులకు నగదు కష్టాలు వెంటాడుతున్నాయని ప్రశ్నించారు.

పెద్దనోట్ల రద్దు విషయంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద నోట్ల రద్దుతో కనీసం వారు అనుకున్న లక్ష్యం కూడా నెరవేరలేదని రఘువీరారెడ్డి అన్నారు. అవినీతి రహితం అంటూనే నల్లధన కుబేరులకు కోట్ల రూపాయల కోత్త నోట్లను పంచిన ప్రభుత్వం ఎలా అవినీతిని నిర్మూలిస్తుందని నిలదీశారు. బ్యాంకుల్లో దొంగనోట్లు కూడా డిపాజిట్ అయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. పెద్ద నోట్ల రద్దు, అనంతరం జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles