ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించిన ఉపముఖ్యమంత్రి Tejaswi Yadav backs Mamata’s ‘super emergency’ assertion

Tejaswi yadav backs mamata s super emergency assertion

Demonetisation, Tejaswi Yadav, Mamata Banerjee, super emergency, bihar deputy cm, nitish kumar, PM Modi, super emergency, tejaswi yadav supports mamata, mamata on demonetisation, mamata on bjp

Bihar Deputy CM Tejaswi Yadav backed West Bengal CM Mamata Banerjee’s assertion that the present situation in the country after the Centre’s demonetisation drive is a ‘super emergency’.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా స్పందించిన ఉపముఖ్యమంత్రి

Posted: 12/28/2016 12:28 PM IST
Tejaswi yadav backs mamata s super emergency assertion

ఒక రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రలు ఒక అంశంపై భిన్నంగా స్పందించారు. దేశం నుంచి అవినీతి, నల్లధనం, ఉగ్రవాద కార్యకలాపాలను అంతం చేసేందుకు తాము తీసుకున్న పెద్ద నోట్ల రద్దు చారిత్రక నిర్ణయమని కేంద్రం ప్రకటించి.. పదే పదే అదే ప్రకటనను చేయడంతో.. ఇది నిజమేనని దేశంలోని ప్రజలు భావిస్తున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ లు మాత్రం ఈ అంశంపై భిన్నంగా స్పందించి ప్రజలను అయోమయంలోకి నెట్టారు.

అదెలా అంటే పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం చాలా బాగుందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పలుమార్లు తన అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తపర్చారు. అయితే ఇదే క్రమంలో అయన బీజేపి నేతల భూముల కొనుగోళ్ల అంశం, బీజేపి నేతలు ఈ నిర్ణయానికి ముందు చేపట్టిన అర్థిక లావాదేవీల అంశంపై మాత్రం తప్పబట్టారు. వాటిని బీజేపి తప్పనిసరిగా బయటపెట్టాలని, వాటిపై వివరణ కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే, పెద్దనోట్ల రద్దు విషయంలో బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ మాత్రం పెదవి విరిచారు.

పెద్ద నోట్ల రద్దు ఎకానమీపై ఎమర్జెన్సీగా అభివర్ణించారు. పేద ప్రజల కొనుగోలు శక్తిపై కేంద్రం చేసిన సర్జికల్ స్ట్రైక్ గా అయన ఎద్దేవా చేశారు. దేశంలో సూపర్‌ ఎమర్జెన్సీ విధించినట్టుగా ఉందన్న బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ వ్యాఖ్యలను బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ సమర్థించారు. నోట్ల రద్దు తరువాత దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల అర్థిక స్థితిగతులు దారుణంగా మారిపోయాయన్నారు. ప్రజల కష్టాలు అంతకంతకూ పెరుగుతున్నాయని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

దేశంలోని గ్రామీణ భారతంలో పరిస్థితులు మరీ దారుణంగా వున్నాయన్నారు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలను సంయమనం పాటించాలని చెబుతున్న ప్రధాని.. వారి కష్టాలపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. ఏటీయం క్యూ లైన్లలో, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోయిన వారి విషయంలో కనీసం సంతాపం వ్యక్తం చేసే సమయం కూడా ప్రధానికి లేకపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తుందన్నారు. ఈ తరుణంలో మమత సూపర్ ఎమర్జెన్సీ వ్యాఖ్యలను తేజస్వి యాదవ్ సమర్థించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles