సీబీఐ అధికారులమంటూ భారీ దోపిడి.. ఇది ఉగ్రవాదుల పనేనా..? 10 cr gold looted from RCPuram muthoot finance

Rs 10 cr worth gold looted from muthoot finance branch in ramachandra puram

Muthoot Finance beeramguda, Muthoot Finance ramachandra puram, Muthoot Finance looted, Muthoot Finance burguly, Muthoot Finance theft, Muthoot Finance dhoraji, Muthoot Finance, gujarat, telangana, Rs. 10 Crore looted, Gold ornaments, foured armed men, CBI, crime news

The CCTV camera footage shows that four men, armed with a revolver and knives, threatened the security and looted RS 10 cr worth gold ornaments.

ITEMVIDEOS: సీబీఐ అధికారులమంటూ భారీ దోపిడి.. ఇది ఉగ్రవాదుల పనేనా..?

Posted: 12/28/2016 10:58 AM IST
Rs 10 cr worth gold looted from muthoot finance branch in ramachandra puram

దేశంలో వున్న బంగారు అభరణాలలో 47 శాతం ముత్తూట్ ఫైనాన్స్, మణపురం ఫైనాన్స్ లలోనే వుందని వార్తలతో దోపిడీ దోంగల దృష్టి ఆయా సంస్థలపై పడిందా..? అంటే అవునన్నట్లుగానే జరుగుతున్నాయి వరుస ఘటనలు. సరిగ్గా గుజరాత్ లోని దోరజీ పట్టణంలో సొమవారం ముత్తూట్ ఫైనాన్స్ పై దోపిడి చేసి 24 గంటల వ్యవధిలోనే మరోమారు తెలంగాణలోని ముత్తూట్ సంస్థపై దొపిడికి పాల్పడ్డారు. సోమవారం బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్న వేళ ముగ్గురు అగంతకులు సంస్థలోకి ప్రవేశించి.. మరణాయుధాలు, రివాల్వర్ తో బెదిరించి దోపిడికీ పాల్పడి 4.8 కేజీ బంగారు అభరణాలను ఎత్తుకుపోయారు.

సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా.. రామచంద్రాపురంలోని తొమ్మిదవ జాతీయ రహదారిపై రామచంద్రారెడ్డి నగర్ లోవున్న ముత్తూట్ ఫైనాన్స్ లో గత రాత్రి జరిగింది. సీబిఐ అధికారులమంటూ అక్కడి సెక్యూరిటీ గార్డును నమ్మించి లోనికి ప్రవేశించిన దుండగులు.. ముత్తూట్ శాఖలోకి ప్రవేశించిన లాకర్లలోని బంగారాన్ని ఎత్తుకేళ్లారు. ఎందుకలా చేస్తున్నారని అడిగిన సెక్యూరిటీని మరణాయుధాలతో బెదిరించారు. ఆ తరువాత ఆయనను బ్యాంకులోనే బంధించారు. కాగా సుమారుగా పది కోట్ల రూపాయల విలువైన 50 కిలోల బంగారు నగలను అపహరించుకుపోయారు.

సీసీ కెమెరాల్లో నమోదైన వివరాలను బట్టి ఎరుపు రంగు స్కార్పియోలో వచ్చిన నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దోపిడీకి పాల్పడ్డారు. మారణాయుధాలతో వచ్చిన వీరు సెక్యూరిటీ గార్డును బెదిరించి, బంధించి దోపిడీకి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ఇవాళ ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి సెక్యూరిటీ గార్డును విడిపించి రామచంద్రాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబరాబాద్ పోలీసులు దోపీడీ జరిగిన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు, క్లూస్ టీమ్ ఘటనాస్థలికి వచ్చి పరిశీలిస్తున్నారు. ఇది పాత నేరస్తుల పని అయివుండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఇదిలావుండగా, సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం కూడా ఇదే ముత్తూట్ పైనాన్స్ సంస్థలో ఉగ్రవాదులు దోపిడీకి పాల్పడ్డారు. మధ్య ప్రదేశ్ లోని తాండ్వా జైలు నుంచి తప్పించుకుని వచ్చి ఉగ్రవాదులు.. బీరంగూడ కమాన్ చెంతనున్న ఈ సంస్థపై రెక్కీ నిర్వహించి.. ఆ తరువాత అదను చూసి దోపిడీకి పాల్పడ్డారు. అయితే దోంగతనానికి పాల్పడిన ఉగ్రవాదులందరన్నీ.. నల్గొండ జిల్లా పోలీసులు ఎదురు కాల్పుల్లో హతమర్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సారి కూడా ఉగ్రవాదులే ఈ దోపిడికీ పాల్పడ్డారా..? లేక ఇది దోంగల పనేనా..? పాత నేరస్థులేనా..? గుజరాత్ లో దోపిడికి పాల్పడిన వ్యక్తులే ఇక్కడ కూడా దోపిడీకి పాల్పడ్డారా.. అక్కడి నేరం జరగగానే తప్పించుకుని నేరుగా రామచంద్రాపురం వచ్చి ఇక్కడ ముత్తూట్ సంస్థపై కూడా దోపిడికి పాల్పడ్డారా..? అన్న కోణంలో సైబరాబాద్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muthoot Finance  gujarat  telangana  Rs. 10 Crore looted  Gold ornaments  foured armed men  CBI  crime news  

Other Articles