దాయాధులూ.. చర్చలకు రారూ.. యుఎన్ పిలుపు UN Chief Ban Ki-moon Calls For India, Pakistan Dialogue

Un chief ban ki moon calls for india pakistan dialogue

UN Secretary-General, Ban Ki-moon, UN Chief Ban Ki moon, United Nations, India, Pakistan, Dialogue, LOC tensions, Line of Control, differences, pakistan journalist

The outgoing UN Secretary-General Ban Ki-moon has again called for India and Pakistan to resolve their differences through dialogue and has expressed concern over the tensions along the Line of Control.

దాయాధులూ.. చర్చలకు రారూ.. యుఎన్ పిలుపు

Posted: 12/22/2016 12:22 PM IST
Un chief ban ki moon calls for india pakistan dialogue

ధాయధులైన భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య రానురాను ఉద్రిక్తలు తీవ్రమైతున్న వేళ.. ఇరు దేశాలకు ఐక్యరాజ్య సమితిని నుంచి పిలువు వచ్చింది. దాయాధి దేశాలు వారి మధ్య నెకోన్న సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్‌ కీ మూన్‌ ఇరు దేశాలను ఆహ్వానించారు. ఇరుదేశాల మధ్యనున్న నియంత్రణ రేఖ వద్ద జరుగుతున్న పరిణామాలు తనకు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని.. ఈ నేపథ్యంలో ఇరుదేశాలు ముందుకు వచ్చి వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ నెలాఖరులో బాన్‌ కీ మూన్‌ పదవీ కాలం ముగుస్తున్న నేపథ్యంలో ఆయన భారత్ పాకిస్థాన్ నియంత్రణ రేఖ వద్ద ఉత్పన్నమవుతున్న ఉద్రిక్త వాతావరణంపై చెక్ పేట్టే దిశగా ప్రయత్నాలను ప్రారంభించారు. దక్షిణాసియా దేశాల్లో శాంతియుత పరిస్ధితులు ఉంటేనే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉంటుందని చెప్పిన ఆయన చర్చలకే భారత్‌-పాక్‌ దేశాలు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. బాన్‌ కీ మూన్‌ తరుపున ఐక్యరాజ్య సమితి అఫిషియల్ స్పోక్స్ పరెన్స్ ఫరాన్‌ హక్‌ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

భారత్‌లో సరిహద్దు వద్ద మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నా.. ఐక్యరాజ్యసమితి వాటిని చూడనట్లు వ్యవహరిస్తోందంటూ ఓ పాక్‌ జర్నలిస్టు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వాటిని ఖండించిన హక్‌ ఈ మేరకు బాన్ కీ మూన్‌ మాటలుగా ప్రకటనను విడుదల చేశారు. కశ్మీర్‌ విషయాన్ని పట్టించుకోవడం లేదనే మాటలు సరికాదని, తాము అన్నింటిని పరిశీలిస్తున్నామని, ఎప్పటికప్పుడు ప్రకటనలు కూడా చేస్తూనే ఉన్నామని తెలిపారు. పాక్‌- భారత్‌ దేశాల మధ్య చర్చలకు బాన్‌ కీ మూన్‌ ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : United Nations  Ban Ki moon  India  Pakistan  Dialogue  LOC  

Other Articles