‘పాపి’శెట్టి పాపం పండింది.. గిరిజ కలసోచ్చింది.. Girija Vaidyanathan appointed Chief Secretary of Tamil Nadu

Girija vaidyanathan appointed chief secretary of tamil nadu

tamil nadu, tamil nadu chief secretary, chief secretary tamil nadu, rammohan rao, girija vaidyanathan, rammohan rao it raids, demonetisation, tamil nadu news, india news, latest news

A fter IT sleuths raids at the Chennai residence of Tamil Nadu Chief Secretary P Rama Mohana Rao, the state government appointed Girija Vaidyanathan to take his place.

‘పాపి’శెట్టి పాపం పండింది.. గిరిజ కలసోచ్చింది..

Posted: 12/22/2016 12:36 PM IST
Girija vaidyanathan appointed chief secretary of tamil nadu

ఎవరి పాపం అయినా పండుతుందని, అయితే కాసింత ముందు వెనక మాత్రమే అవుతుందని పెద్దలన్న మాట తమిళనాడులో అక్షర రూపం దాల్చింది. తమిళ నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహనరావు అక్రమ సంపాదన కూడా అలాగే కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాత పెద్దనోట్ల రద్దుతో ఆయన గారి భాగోతం బట్టబయలైంది. రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు జరిగిన నేపథ్యంలో ఆయనను తమిళనాడు ముఖ్య కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిగా ఆయన స్థానంలో గిరిజా వైద్యనాథన్ ను రాష్ట్రంలోని పన్నీరు సెల్వం ప్రభుత్వం నియమించింది.

రామ్మోహన్ రావు ఇంటిపై అదాయ పన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహించగా అక్రమంగా డబ్బువుందని కనుగోనడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఈ చర్యలు తీసుకుంది. దీంతో ఆయను ఏ క్షణంలోనైనా అదాయపన్ను శాఖ అధికారులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. కాగా, జయలలిత హయాంలో సీఎస్‌గా నియమితులైన రామ్మోహనరావు, ఆయన బంధువులు, స్నేహితులకు చెందిన ఇళ్లపై 13 ప్రాంతాల్లో దాదాపు 25 గంటల పాటు ఆదాయపన్ను శాఖ దాడులు జరిపి 154 కోట్ల రూపాయల నగదును, 167 కిలోల బంగారాన్ని స్వాథీనం చేసుకున్నారు. అయితే 154 కోట్ల రూపాయలలో 34 కోట్ల రూపాయలు కొత్త నోట్లే కావడం గమనార్హం.
 
రాష్ట్రప్రభుత్వానికి ఇది మాయనిమచ్చగా మారిందని అన్ని పక్షాల నుంచి విమర్శలు రావడంతో సీఎం పన్నీర్ సెల్వం హుటాహుటిన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటుచేసి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఆయనను తప్పిస్తూ.. నిర్ణయం వెలువరించగా, అందుకు రాష్ట్ర మంత్రిమండలి కూడా పచ్చజెండా ఊపింది. ఆయన స్థానంలో అయనకన్నా సీనియర్ అయిన గిరిజా వైద్యనాథన్‌ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గిరిజా వైద్యనాథన్.. ముందునుంచి తమిళనాడులోనే పనిచేస్తున్నారు.

రామ్మోహన్ రావుపై అవినీతి భాగోతం వెలుగులోకి రావడంతో.. గతంలోనూ అయనపై వెల్లువెత్తిన అరోపణలు ఇప్పుడు మళ్లీ ప్రచారంలోకి వచ్చాయి. 17 మంది సీనియర్ ఐఎఎస్ లను కాదని. రామ్మోహన్ రావును తమిళనాడు సీఎస్ గా నియమించడంలో శశికళ కీలక పాత్ర పోషించారని కూడా వార్తలు వస్తున్నాయి. శశికళతో వున్న అటాచ్ మెంట్ నేపథ్యంలోనే ఆయన ఇంటిపై ఐటీ దాడులు జరిగాయని కూడా గుసగుసలు వినబడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chief secretary  rammohan rao  girija vaidyanathan  it raids  demonetisation  tamil nadu  

Other Articles