ఎగసి.. పడిన కెరటంలా.. ఆ ఖాతాల్లోని డబ్బు.. Jan Dhan deposits fall post Rs 75000 crore peak

Jan dhan deposits fall post rs 75000 crore peak

old currency, Midnapore, Kolkata, jan dhan Accounts, deposits, withdrawls, Central Board of Direct Taxes, CBDT, ARA

After peaking at nearly Rs 75,000 crore, Jan Dhan deposits have started to decline even much before the deadline for depositing old Rs 500 and Rs 1,000 notes ends on December 30.

ఎగసి.. పడిన కెరటంలా.. ఆ ఖాతాల్లోని డబ్బు..

Posted: 12/22/2016 11:43 AM IST
Jan dhan deposits fall post rs 75000 crore peak

పెద్ద నోట్లు రద్దుతో జన్ ధన్ ఖాతాల్లో ఒక్కసారిగా పెరిగిన డిపాజిట్లు ఎగసిన కెరటాన్ని తలపిస్తే.. మరో 8 రోజులు మాత్రమే పాత నోట్ల డిపాజిట్లకు సమయం వున్న నేపథ్యంలో అవి ఇంకాస్త పెరుగుతాయన్న కేంద్ర అర్ధిక శాఖ, అర్భీఐ అధికారుల అంచాలు అవిరయ్యాయి. వెల్లువలా వచ్చిన డిపాజిట్లు రూ.75 వేల కోట్ల మార్కుకు చేరువలో ఎగిసి.. ఇక తగ్గడం ప్రారంభించాయి. తుది గడువు దగ్గపడుతుండటంతో పాటు జన్ ధన్ అకౌంట్లలో మరింత డబ్బు జమ అవుతుందని ఆవించిన అధికారుల ఆంచానాలకు బ్రేకులు పడ్డాయి.

జన్ ధన్ ఖాతాల్లోని డబ్బు క్రమంగా తగ్గడానికి ఆర్బీఐ తీసుకొస్తున్న నిబంధనలు కారణం కగా, ఆర్బీఐతో పాటుగా కేంద్ర ఆర్థికశాఖ అధికారులు సైతం జారీ చేసిన హెచ్చరికలు కూడా కారణంగా స్పష్టం అవుతోంది. పెద్ద నోట్లు రద్దు ప్రకటన నేపథ్చేయంలో నవంబర్ 9న రూ.45,636 కోట్లగా ఉన్న ఈ అకౌంట్లో డిపాజిట్లు నవంబర్ 23 వరకు రూ.72,843 కోట్లకు ఎగిశాయి. సుమారుగా రూ.74,609 కోట్లు వరకు చేరిన డిపాజిట్లు అక్కడి నుంచి రివర్స్ ట్రెండ్ లో పయనిస్తున్నాయని వెల్లడవుతోంది.
 
ఈ అకౌంట్లు దుర్వినియోగానికి వాడకుండా ఉండేందుకు జన్ ధన్ అకౌంట్ హోల్డర్స్ వివరాలను తమకు అందించాలని మొదటి సారి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సైతం బ్యాంకులను ఆదేశించింది. ఈ అకౌంట్లలో రూ.50వేల కంటే అధిక మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్న వారి దగ్గర కేవైసీ తీసుకోవాలని బ్యాంకులకు సూచించింది. అంతేకాక ఈ అకౌంట్లతో లింక్ అయి ఉన్న ఇతరాత్ర ప్రయోజనాలను వారు కోల్పోయే అవకాశముందని వార్తలు వినిపించడంతో అకౌంట్లలో డిపాజిట్ తగ్గడం ప్రారంభమైయ్యాయి. పన్ను పరిమితుల కంటే తక్కువగా ఉండి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని జన్ ధన్ అకౌంట్లోని లెక్కలో చూపని రూ.1.64  కోట్ల డిపాజిట్ అయినట్టు ఐటీ శాఖ గుర్తించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles