పెద్దనోట్లే కాదు.. దేశాన్ని పిడీంచే సమస్యలనేకం.. Pawan Kalyan targets RBI chief, dubs note ban a disaster

Pawan kalyan targets rbi chief dubs note ban a disaster

pawan kalyan, demonetisation, Urjit patel, Jana Sena Party, narendra modi, venkaiah naidu, vemula rohith, twitter, tweet, jana sena, partiotism, demonetisation, special status to ap

Popular Telugu actor and Jana Sena president Pawan Kalyan came down heavily on RBI Governor Urjit Patel and called demonetization a disaster.

జరిగింది పెద్దనోట్ల రద్దు కాదు.. మార్పిడే.. అవినీతి పెరిగింది: పవన్ కల్యాణ్

Posted: 12/20/2016 04:25 PM IST
Pawan kalyan targets rbi chief dubs note ban a disaster

కేంద్ర ప్రభత్వం తీసుకున్న నోట్ల రద్దు అంశంపై అర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలోని కర్నూలుకు చెందిన దివంగత బాలరాజు మరణంతో తన హృదాయాన్ని కలిచి వేసిందని అప్పట్లోనే నోట్ల రద్దుపై మండిపడి.. కేంద్రం త్వరతగతిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇవాళ మరోసారి బాలరాజు ఆకస్మిక మరణం గురించి ప్రస్తావించిన ఆయన కేంద్రం ఎంతో ఆలోచించి తీసుకొచ్చిన పెద్దనోట్ల రద్దు వల్ల ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది అభాగ్యులలో ఈయన ఒకరని దుయ్యబట్టారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 69 సంవత్సరాలు అవుతున్నా.. ఈ దేశంలో మనుషులు ఇంకా మ్యానువల్ స్కావంజర్స్ విధానాన్ని రూపుమాపలేకపోయామని, అలాంటి దేశంలో 'క్యాష్‌లెస్‌ ఎకానమీ' (నగదు రహిత ఆర్థిక వ్యవస్థ) సాధ్యమని మీరు భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఉర్జిత్ పటేల్ అద్భుతమైన మేధోమథనం నుంచి ఉద్భవించిన డీమోనిటైజేషన్ ఈ దేశానికి అంత అవసరమా..? అని నిలదీశారు. దేశంలో అనేక జాడ్యాలు ఇంకా ప్రబలుతూనే వున్నాయని.. వాటిపై ముందుగా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎంతో ఆలోచించి ఉర్జిత్‌ పటేల్‌ ప్రవేశపెట్టిన పెద్దనోట్ల రద్దు వల్ల ఆయన సహచర భారతీయులైన ఆదివాసీలు, రైతులు, దినసరి కూలీలు, గృహిణులు, ఉద్యోగులు, వృద్ధులు, పండ్లు, కూరగాయాల వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, చిన్న వ్యాపారులు ఇలా చాలామంది కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. కిలోమీటర్ల పొడవున్న క్యూలలో నిలబడలేక సామాన్యులు ప్రాణాలు విడుస్తున్నారని ఆయన అవేదన వ్యక్తం చేశారు.

మీరు అనాలోచితంగా సూచించిన ఈ నిర్ణయం వల్ల దేశంలోని అన్ని రంగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలవుతున్నారని, అయితే దుర్మార్గులు, దేశాన్ని నాశనం చేసిన వారంతా ఇంట్లో కూర్చుని డబ్బులు మార్చుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నల్లధనాన్ని రద్దు చేసేశామని, దేశాన్ని అవినీతి రహితంగా మార్చేశామని చంకలు గుద్దుకుని ఎగరవచ్చని ఎద్దేవా చేసిన ఆయన, 'వాస్తవం ఏంటంటే, మీరు పాతవాటిని కొత్తగా మార్చారు' అంటూ పవన్ తీవ్రంగా విమర్శించారు. ఇక దోపిడీదారుల వర్గంలో బ్యాంకింగ్‌ ఉద్యోగులు కూడా చేరిపోయారు' అంటూ పవన్‌ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  demonetisation  Urjit patel  Jana Sena Party  

Other Articles