టర్కీ అమెరికా ఎంబస్సీ ఎదుట కాల్పుల కలకలం.. Shots outside US embassy in Turkey

Man detained in turkey after firing shots outside us embassy

andrei karlov,recep tayyip erdogan,sahin s,shooting,turkey,u.s. embassy,u.s. embassy shooting,united states embassy,U.S. Embassy,political,general news,national,public security,crime,legal action,international relations,politics,terrorism

The U.S. closed its three main missions in Turkey on Tuesday after a Turkish man fired shots outside its embassy in Ankara, just hours after a local policeman in the capital assassinated the Russian envoy

టర్కీ అమెరికా ఎంబస్సీ ఎదుట కాల్పుల కలకలం..

Posted: 12/20/2016 04:21 PM IST
Man detained in turkey after firing shots outside us embassy

టర్కీ రాజధాని అంకారాలోని ఓ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రష్యా రాయబారిని ఓ అనుమానిత ఉగ్రవాది కాల్చిచంపిన ఘటన జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. సిటీలో ఓ ఎగ్జిబిషన్ లో టర్కీలో రష్యా రాయబారి ఆండ్రీ కర్లోవ్‌ మాట్లాడుతుండగా వెనకనుంచి వచ్చిన ఆగంతకుడు గన్ తో ఆండ్రీపై విచక్షణరహితంగా కాల్పులు జరిపి హతమార్చాడు. ఈ ఘటన మిగిల్చిన విషాధచాయల నుంచి కోలుకుంటున్న తరుణంలో మరో హింస్మాత్మ ఘటన చోటుచేసుకుంది.

అంకారాలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. నల్లటి కోటు ధరించి వచ్చిన ఆ ఆగంతుకుడు... గాల్లోకి ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపాడు. అనంతరం ఎంబసీలోకి చొరబడేందుకు యత్నించాడు. కాని, అక్కడ ఉన్న గార్డులు అతన్ని సమయస్ఫూర్తితో ఎదుర్కొని... అతడిని పట్టుకున్నారు. చేతిలోని గన్ ను లాక్కుని, అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయలు కాలేదు. కానీ, వరుసగా రెండో ఘటన జరగడంతో అక్కడి అధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో ఏ క్షణం ఏం  జరుగుతుందోనన్న అందోళనకు టర్నీ వాసులు గురవుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Russian ambassador  shot dead  Andrey Karlov  Turkey  u.s. embassy  shooting  

Other Articles