బాణాసంచా మార్కెట్ లో భారీ పేలుడు.. 27 మంది మృతి | 27 killed, 70 hurt in Mexico fireworks market blast.

Deadly fireworks explosion in mexico

fireworks market blast, Mexico fireworks, Mexico Market blast, Massive fireworks market blast, Mexico Fireworks blast, Mexico Blast, 27 Killed Mexico

Massive fireworks market blast kills at least 26 in Mexico.

మెక్సికోలో భారీ పేలుడు.. 27 మంది మృతి

Posted: 12/21/2016 08:39 AM IST
Deadly fireworks explosion in mexico

మెక్సికో భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఓ బాణసంచా మార్కెట్లో జరిగిన భారీ పేలుడులో 27 మంది సజీవదహనమయ్యారు. మరో 72 మంది తీవ్రంగా గాయపడ్డారు. మెక్సికో సిటీకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న టుల్టెపెక్‌లోని శాన్ పాబ్లిటో ఫైర్‌వర్క్స్‌ మార్కెట్లో మంగళవారం ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

మార్కెట్ పరిసరాలు భీతావహమయ్యాయి. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు ధాటికి 3 కి.మీ. మేర భవనాలు దెబ్బతిన్నాయి కూడా. బహుశా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం భారీ ఎత్తున్న బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఈ పేలుడు జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

ఇంతకు ముందు 2005 సెప్టెంబరు లో స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు కూడా ఇక్కడ పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. అప్పటి ఘటనలోనూ పలువురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అధికారులు పేలుడుకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఉగ్రవాద చర్యా? లేకుంటే ప్రమాదవశాత్తు పేలుడు జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mexico  fireworks market blast  27 Killed  

Other Articles