అమ్మ కుటుంబ వారసులకు శుభవార్త.. అస్తులన్నీ వారికే.. Hyderabad High Court's Clarity over Jayalalithaa's Heir?

Hyderabad high court s clarity over jayalalithaa s heir

jayalalithaa, tamilnadu late chief minister, chennai apollo hospital, AIADMK, hyderabad high court's clarity over jayalalithaa's heir?, jayalalithaa's heir, jayalalithaa's medchal land, jayalalithaa's hyderabad properties

A ruling of Hyderabad High Court gave some clarity over the heir and inheritance of former Tamil Nadu Chief Minister, Jayalalithaa.

అమ్మ కుటుంబ వారసులకు శుభవార్త.. పిటీషనర్ కు లక్ష ఫైన్..

Posted: 12/20/2016 04:13 PM IST
Hyderabad high court s clarity over jayalalithaa s heir

సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో అస్పత్రిలో చేరి.. కోలుకున్నాక ఇక అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి రాష్ట్ర పగ్గాలను అందుకుంటారన్న నేపథ్యంలో మరోమారు అమె తీవ్ర అస్వస్థతకు గురై.. హఠాన్మరణం చెందిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అస్తుల కేసులో రాష్ట్ర హైకోర్టు స్పష్టతనిచ్చింది. జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని జీడిమెట్లలో ఓ ఫాంహౌస్‌, శ్రీనగర్‌ కాలనీలో ఓ భవనంతో పాటు మేడ్చల్ లోని ఫామ్ హౌజ్ లను రాష్ట్ర ప్రభుత్వం స్వాథీనం చేసుకునేలా అదేశాలు ఇవ్వాలని ఓ న్యాయవాది హైకోర్టులో పిల్ వేశారు.

ఈ ఆస్తుల‌కు సంబంధించి జయలలిత ఎలాంటి వీలునామా రాయ‌లేద‌ని ఆ ఆస్తుల‌ను తెలంగాణ స‌ర్కారు స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలని గరీబ్‌ గైడ్‌ సంస్థ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ పిటిష‌న్‌ను విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు స‌ద‌రు సంస్థకు చివాట్లు పెట్టింది. ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని మండిప‌డింది. ఇందుకు గాను లక్ష రూపాయల జరిమానా కూడా చెల్లించాలని పిటీషనర్ ను అదేశించింది.

జయలలితకు వారసులు లేరని.. అమెకు చెందిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా అదేశాలు ఇవ్వాలన్న పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత వీలునామా రాయలేదని, ఆమెకు వారసులు లేరని మీరెలా ఊహిస్తార‌ని పిటిషనర్లను ప్రశ్నిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేశారు. అమె అన్న సంతానం వున్నారు కాబట్టి.. వీలునామా రాయకపోయినా.. హిందూ చట్టం ప్రకారం అస్తులు వారికే చెందుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇటువంటి పిటిష‌న్లు మరోమారు దాఖలు చేయారాదని గరీబ్‌గైడ్‌ సంస్థను అదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  tamilnadu  late chief minister  assets  legal heir  medchal land  AIADMK  

Other Articles