టూమచ్: సాయంత్రం ఆరు వరకే న్యూఇయర్ వేడుకలా? | no new year celebrations after six.

New year s celebrations ban

Bangladesh New Year's Eve, New Year celebrations ban, Bangladesh New Year, India New Year Celebrations, Bangladesh Home Minister, Asaduzzaman Khan Kamal, India new year celebrations, 2016 new year celebrations

Bangladesh to ban New Year's Eve public gatherings, celebrations on 1st January.

కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధాజ్నలు

Posted: 12/20/2016 04:04 PM IST
New year s celebrations ban

కొత్త సంవత్సరం వేడుకలకు సమయం సమీపిస్తోంది. పాత జ్నాపకాలకు వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని జోష్ తో ఆహ్వానం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్ధమైపోతుంది. కానీ, అక్కడ మాత్రం సంబరాలకు అవకాశం లేకుండా అనూహ్యంగా నిషేధాజ్నలు విధించేశారు. అవును.. పొరుగు దేశం బంగ్లాదేశ్ నూతన సంవత్సర వేడుకలను బ్యాన్ చేసింది. ఈ ఏడాది ఇలాంటి వేడుకలను నిషేధిస్తూ బంగ్లా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ దేశ హోం శాఖామంత్రి అసదుజ్జమన్ ఖాన్ కమాల్ ఆదేశాలు జారీ చేశారు.

ప్రజలు గుంపులు గుంపులుగా కలుసుకోవడం, బహిరంగ ప్రదర్శనలు ఇవ్వడం, సంబరాలు చేసుకోవడాన్ని నిషేధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఇంకా ఎవరైనా ఇంట్లో వేడుక నిర్వహించుకోవాలనుకుంటే స్థానిక పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సాయంత్రం ఆరు తరువాత క్లబ్బులు, పబ్బులు మూసేయాలని, ఎటువంటి బాణాసంచా కాల్చరాదని ఆయన ప్రకటించినట్లు జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.

న్యూఇయర్ రోజును పురస్కరించుకుని యువత చట్టాలను అతిక్రమంచి చేయరాని పనులు చేస్తున్నారని, వాటిని నిరోధించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఆ రోజు బంగ్లాదేశ్ లోని ప్రధాన పట్టణాల్లో గస్తీ పెంచుతామని ఆయన తెలిపారు. దీనిపై నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వేడుకలు జరుగుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. పాశ్చాత్య దేశాల్లో న్యూఇయర్ ను అద్భుతరీతిలో సెలబ్రేట్ చేసుకుంటారు. అలాంటి వాటిపై బ్యాన్ విధించటం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangladesh Home Minister  Asaduzzaman Khan Kamal  

Other Articles