ఎవరికి మతి భ్రమించిందో అర్థమవుతోంది.. Corruption stories against me are planted, says Kiren Rijiju

Pelt stones at dilip ghosh throw him out of wb kolkata imam issues fatwa

Dilip Ghosh, West Bengal, Kolkata Imam, Mamata Banerjee, fatwa, Idris Ali, BJP Chief Dilip Ghosh, Suman Sahoo, Jhargram police station

A muslim cleric on Monday issued a fatwa against Dilip Ghosh for making ‘filthy’ comments against West Bengal chief minister Mamata Banerjee.

ఎవరికి మతి భ్రమించిందో అర్థమవుతోంది..

Posted: 12/13/2016 04:36 PM IST
Pelt stones at dilip ghosh throw him out of wb kolkata imam issues fatwa

పెద్ద నోట్ల రద్దు సమాచారాన్ని ముందుగానే తమ అనుకూరులకు తెలియపర్చిన ఎన్డీయే ప్రభుత్వం ప్రజలకు మాత్రం అవినీతి రహిత భారతావని అంటూ నీతస్తూక్తులు వల్లవెస్తుందని దేశవ్యాప్త ఉద్యమానికి నాంది పలికిన పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై ఆ రాష్ట్ర బీజేపి అద్యక్షుడు దిలీస్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో తాను చేసిన తప్పుపై నాలుకు కరుచుకున్న సదరు నేత.. చ.. చ అలాంటిదేం లేదు.. నేను క్షమాపణలు చెప్పలేదు అని కూడా వెనువెంటనే ప్లేటు పిరాయించాడు.

పెద్ద నోట్ల రద్దుతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వేల కోట్లు నష్టపోయారని... దాంతో ఆమెకు మతి భ్రమించిందని...ఆయన విమర్శించారు. అంతటితో అగకుండా.. ఢిల్లీలో ఆమె డ్రామా చేస్తున్నప్పుడు, ఆమె జుట్టు పట్టి లాగేసేవాళ్లమనీ, ఎందుకంటే ఢిల్లీలోని పోలీసులంతా తమవారే అని... కానీ తాము అలా చేయలేదని దిలీప్ ఘోష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత కొద్దిసేపటికి ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు.

గౌరవనీయులైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తన వ్యాఖ్యలను అవమానకరంగా భావిస్తే... ఆమెకు క్షమాపణలు చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని క్షమాపణలను తెలియబర్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఆలోచన తనకు లేదని తెలిపారు. ఇలా చెప్పిచెప్పిన తరువాత వెనువెంటనే ప్లేటు మార్చారు. తాను మమతకు క్షమాపణలు చెప్పిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. కేవలం విచారం మాత్రమే వ్యక్తం చేశానని తెలిపారు.

ఇదిలావుండగా, తనను రాళ్లతో కోట్టాలని, పశ్చమ బెంగాల్ నుంచి తరమికోట్టాలని ఘోష్ కు వ్యతిరేకంగా ఫత్యా జారి చేసిన టిప్పు సుల్తాన్ మసీదు షాహీ ఇమామ్  మౌలానా నూర్ ఉర్ రహమాన్ బర్కతీపై కూడా ఆయన తీవ్రస్థాయిలోనే విరుచుకుపడ్డారు. భారత దేశాన్ని పాకిస్థాన్ అనుకుంటున్నారా.. ? లేక బంగ్లాదేశ్ అనుకుంటున్నారా..? తనకు వ్యతిరేకంగా పత్యా జారీ చేసే అధికారి ఎవరిచ్చారని అయన ప్రశ్నించారు. షహీ ఇమామ్ బెంగాల్ లో కానీ భారత్ లో కానీ ఎక్కువ కాలం వుండాలని అనుకుంటున్నట్లు లేదని, ఆయన త్వరలోనే పాకిస్థాన్ లేదా బంగ్లాదేశ్ కు వలసవెళ్తాడని తాను భావిస్తున్నట్లు ఘెష్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles