ఆ సిఫార్సు అమలైతే.. నాయకులకు వాచిపోద్ది.. Bar people from contesting from two seats, EC recommends centre

Bar people from contesting from two seats recommends election commission

election commission, election rules, uttar pradesh election, election commission norms, election norms, election commission news, india news

The Election Commission has asked the government to amend laws to bar people from contesting from two seats

ఆ సిఫార్సు అమలైతే.. నాయకులకు వాచిపోద్ది..

Posted: 12/13/2016 05:22 PM IST
Bar people from contesting from two seats recommends election commission

ఇక మీదట నాయకులకు వాచిపోతుంది.. కేంద్ర ఎన్నికల కమీషన్ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమెదించడమే.. ఆలస్యం.. ఒకవేళ కేంద్రం ఈసీ సిఫార్సులను అమోదిస్తే.. కచ్చితంగా నాయకులకు వాచిపోతుంది. లేదా ఖర్చు పేలిపోతుంది. అదేంటి అంటారా..? ఎన్నికలలో ఖర్చుల వ్యయాన్ని పెంచుతున్నారా అన్న సందేహాలు అవసరం లేదు. ఎందుకంటే ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా అభ్యర్థుల ఖర్చులను సవరించారు. అయితే ఏంటీ మ్యాటర్ అంటారా..?

ఇప్పటి వరకు నాయకులు తమకు పట్టున్న రెండు స్తానాల్లో పోటీకి దిగడం.. ఒక్కోసారి రెండు స్థానాల నుంచి గెలవడం లేదా ఒక్క స్థానంలో గెలుపోందడం మనం చూసిందే. అయితే రెండు వేర్వేరు స్థానాల్లో అభ్యర్థులు పోటీకి పాల్పడటాన్ని ఇకపై రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఒక వ్యక్తి ఒకేసారి రెండుస్థానాల్లో పోటీచేసేందుకు వీలు లేకుండా నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీ కోరింది.

ఇది కుదరని పక్షంలో కనీసం రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థి ఒకదానిని ఖాళీ చేసి ఉప ఎన్నికలకు కారణమైతే.. అందుకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వానికి చెల్లించేలా ఆదేశించేలా ఎన్నికల చట్టాల్లో సవరణలు తీసుకురావాలని సూచించింది. దీంతో రెండు స్థానాల్లో గెలిచిన అభ్యర్థికి ఎటు చూసినా జేబులకు చిల్లులు పడటం ఖాయంగా కనిపిస్తుంది. అయితే ఈ రెండింటిలో కేంద్రం ఏ సిఫార్సును అమలుకు అమోదముద్ర వేస్తుందో కూడా వేచి చూడాలి.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం ఒక వ్యక్తి సాధారణ ఎన్నికలు లేదా ఉప ఎన్నికలు, లేదా ద్వైవార్షిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలకైనా పోటీ చేసే వెసలు బాటు వుంది. అయితే ఈ వెసలుబాటు 1996లో సవరించిన కేంద్రం.. అప్పటి నుంచి ఒక్క అభ్యర్థి కేవలం రెండు స్థానాలకు మాత్రమే పోటీచేసేలా సవరణ చేసింది. అయితే, కేంద్ర న్యాయశాఖకు ఇటీవల ప్రతిపాదించిన ఎన్నికల సంస్కరణల్లో సెక్షన్‌ 33 (7)ను సవరించి ఒక అభ్యర్థిని ఒకే స్థానంలో పోటీచేసేలా పరిమితి విధించాలని లేని పక్షంలో గెలిచిన అభ్యర్థి ఖాళీ చేసే సీటులో జరిగే ఉప ఎన్నికల వ్యయాన్ని తానే భరించేలా సవరణలు తీసుకురావాలని కోరింది. ఈ వ్యయాన్ని అసెంబ్లీ స్థానానికి రూ. 5 లక్షలుగా, లోక్‌సభ స్థానానికి రూ. 10 లక్షలుగా ఈసీ ప్రతిపాదించింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : election commission  ammendment  election rules  union government  india news  

Other Articles