ఉన్నమాటంటే ఉల్లిక్కిపడిన కేంద్రమంత్రి.. Corruption stories against me are planted, says Kiren Rijiju

Kiren rijiju says accusers will be beaten up with shoes

Kiren Rijiju, Arunachal Pradesh, hydroelectric project, corruption, Tawang, Kameng Hydro Electric Project

Kiren Rijiju said he wrote a letter to Piyush Goyal on hydroelectric project in Arunachal Pradesh to address the grievance of his constituents

చెప్పు దెబ్బలు తింటారు జాగ్రత్తా..

Posted: 12/13/2016 03:43 PM IST
Kiren rijiju says accusers will be beaten up with shoes

అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మితమవుతున్న కొత్త పవర్ ప్రాజెక్టు పనులను తన సమీప బంధువులకు ఇప్పించి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్టు 450 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని అరోపణలు గుప్పుమన్న నేపథ్యంలో వీటిపై ఆయన స్పందించారు. తనపై వస్తున్న అరోపణలన్నీ సత్యదూరమని కొట్టిపారేశారు. ఇలాంటి కల్పిత కథనాలను తనపై సృష్టించిన వారు ముందుకు వస్తే.. ఖచ్చితంగా చెప్పుదెబ్బలు తింటారని అయన అన్నారు.

సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో నిర్మితమవుతున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు బిల్లులను త్వరతగతిన క్లియర్ చేయాలని ఆయన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ కు లేఖ రాయడమే ఇందుకు ఊతమిస్తుంది. అయితే ధీనిపై స్పందించి మంత్రి తాను పియుష్ గోయల్ కు లేఖ రాసిన మాట వాస్తవమేనన్నారు. తన పార్లమెంటు నియోజక ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా తన దృష్టికి వచ్చిన పెండింగ్ బిల్స్ సమస్యపై తాను స్పందించి లేఖ రాశారని, అంతమాత్రన తాను ఎక్కడా తప్పు చేయలేదని, అవినీతికి పాల్పడలేదని చెపుకోచ్చారు.

ఈ కుంభకోణంలో కిరెన్‌ పాత్ర ఉందడానికి తమ వద్ద 'ఆడియో ప్రూఫ్‌' ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. రిజిజు నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఈ విద్యుత్‌ ప్రాజెక్టు ప్రదేశంలో గుట్టలు, రాళ్లు తొలగించడానికి భారీగా పెంచిన ధరలతో, కల్పిత బిల్లులతో అక్రమార్కులు లబ్ధి పొందారని, తన ప్రోద్బలంతో వారికి రిజిజు అండగా నిలిచారని, రిజిజు బంధువు నేరుగా ఈ హైడల్‌ ప్రాజెక్టుతో సంబంధం ఉందని కథనాలు వచ్చాయి. కాగా, ఈ కుంభకోణం విషయంలో తననెలాంటి వివరణ కూడా ప్రధాన మంత్రి కార్యాలయం కోరలేదని ఆయన స్పష్టం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles