ఆ కొరియర్ బోయ్ దెబ్బకి హీరో అయిపోయాడు | Courier boy saves woman being held captive by husband.

Courier helps free captive who wrote call 911 on parcel

Delivery driver, Courier boy saves woman, Parcel 911, Courier 911, UPS driver helps free woman, hostage woman husband, Contact 911 saves life, Courier save two life, Courier boy saves woman, mother son courier, James Jordan arrest

Delivery driver saves woman and toddler being held captive after spotting cry for help scrawled on parcel.

రెండు నిండు ప్రాణాలు కాపాడిన కొరియర్

Posted: 12/13/2016 04:12 PM IST
Courier helps free captive who wrote call 911 on parcel

ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కు బిక్కుమంటూ వణికిపోతున్న ఆ మహిళకు కొరియర్ బాయ్ రూపంలో దేవుడు దిగివచ్చాడు. అయితే యముడు వెనకాలే ఉండటంతో కాస్త తెలివి ప్రదర్శించింది. అంతే తన కొడుకుతోపాటు, తన ప్రాణాలు కాపాడుకోవటమే కాదు, భర్త రూపంలో ఉన్న రాక్షసుడి నుంచి విముక్తి పొందింది. ఇంతకీ ఏం చేసింది? కొరియర్ ఆమె ప్రాణాలు ఎలా కాపాడింది? తెలుసుకోవాలంటే ముస్సోరిలో జరిగిన ఈ ఘటన తెలుసుకోండి.

ఫ్రాంక్లిన్ కంట్రీలో ఉండే ఓ జంటకి ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ, భర్త ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు. మూడేళ్ల పిల్లాడిని పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా వేరే గదిలో బంధించాడు. ఆమె జుట్టు పట్టుకుని నేలకేసి కొట్టాడు. కనిపించిన వస్తువుతో బాదాడు. లైంగికంగా వేధించాడు. ఇలా పదిహేను గంటలపాటు వికృత క్రీడ చేశాడు. అంతేకాదు ఓ గన్ తో ఆమె ప్రాణాలు తీసేందుకు యత్నించబోయాడు. అయితే అప్పుడే ఆమె అదృష్టం బాగుండి కొరియర్ రూపంలో ఆమె ప్రాణాలు నిలిచాయి.

James Jordan arrest

ఓ కొరియర్ అర్జెంట్ గా పంపాల్సి రావటంతో భర్త యూపీఎస్ కొరియర్ కంపెనీ వాళ్లకి కబురు పంపాడు. అది కొరియర్ బాయ్ కి ఇవ్వాల్సిందిగా భార్యకు సూచించి, వెనకాలే అతనూ గన్ తో నిలుచున్నాడు. అదే మెరుపులాంటి ఆలోచన చేసిన ఆమె సంతకంతోపాటు బాక్స్ పై ‘911 (ఎమర్జెన్సీ నంబర్) కి కాల్ చేయమని’ రాసింది. బాక్స్ ని పరిశీలించిన ఆ బాయ్ ఆమె ఆపదలో ఉందని అర్థం చేసుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారు రంగంలోకి దిగటం ఆ శాడిస్ట్ భర్తను అరెస్ట్ చేయటం, తల్లి బిడ్డలకు విముక్తి కల్పించటం చకచకా జరిగిపోయాయి.

గొడవ ఏంటో చెప్పకపోయినప్పటికీ, సమయానికి ఆ కొరియర్ బాయ్ స్పందించకపోయి ఉంటే మాత్రం రెండు నిండు ప్రాణాలు బలయ్యి ఉండేవని ఓ పోలీస్ అధికారి తెలిపాడు. మొత్తానికి టైమ్ కి స్పందించిన ఆ కొరియర్ బాయ్ పోలీసుల దృష్టిలో హీరో అవ్వటమే కాదు, పని చేసే కంపెనీ నుంచి అభినందనలు కూడా అందుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Courier boy saves woman  Contact 911  

Other Articles