రూ. 500 కొత్త నోటును వీడని బాలారిష్టాలు.. Is New Rs. 500 note, not water proof..? quality matters

Is new rs 500 note not water proof quality matters

new 500 note losing colour, new fake Rs 500 note, new Rs 500 losing colour, new RS 500 note water proof, 500 note not water proof, Rs 500 note, waterproof, quality test, Advocate, sai krishna azad, gandhiji emblem, colour, letters, fake note

An Advocate from hyderabad shanker matt accidentally dropped his new Rs.500 note, who removed and noticed few letters lost.

రూ. 500 కొత్త నోటును వీడని బాలారిష్టాలు..

Posted: 12/02/2016 04:11 PM IST
Is new rs 500 note not water proof quality matters

దేశంలోని అవినీతిని, నల్లధనాన్ని తరమికోట్టేుందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. డిజిటల్ మనీ, క్యాష్ లెస్ ఇండియాగా రూపాంతరం చెందాలని భావిస్తుంది. ఈ తరుణంలో అందుకు కొంత సమయం పడుతుందని భావించిన కేంద్రం.. ముందుగా రూ. 500, రూ. 2000 కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. అయితే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల నాణ్యతను పరీక్షించే పనిలో కొందరు బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే రూ.2000 నోటుపై వివిధ రకాలుగా పరీక్షలు చేసిన వీడియోలు ఆన్‌ లైన్‌ లో సంచలనం చేశాయి.

కొత్త నోటు నలుగుతుందా, వాటర్ ప్రూఫా అని పరీక్షించారు. రూ. 2000 నోటును నీటిలో ముంచి పరీక్షించారు. తడిసిన నోటు రంగు కిద్దిగా పోయింది. ఇది కాస్త పెను సంచలనంగా కొత్త నోటు రంగుపోతుందన్న కూడా వార్తలు రావడంతో.. అర్భీఐ దీనిపై స్పష్టతను కూడా ఇచ్చింది. కేంద్రం ముద్రించిన కొత్త నోటు రంగు పోతేనే అది ఒరిజినల్ అని, లేకపోతే కాదు అని కూడా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తకాంత్ దాస్ స్పష్టతనిచ్చారు. దీంతో నోటు తడిసిన ఇబ్బందులు లేవని తేల్చారు. యూట్యూబ్‌ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించారు.

కాగా, ఇప్పటికీ దేశ ప్రజలతో ఇదిగో వస్తున్నాను.. అదిగో వస్తున్నాను అంటూ దోబూచులాడుతున్న కొత్త రూ.500 నోటు కొందరికి మాత్రం లభించింది. ఈ నోటు దర్శనం చేసుకుందామన్నా.. ఎవరికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ నోటుపై పరీక్షలు ఇంకా మెదలు కాలేదు. అయితే వచ్చిన నోట్లలో పలు నోట్లు తప్పదాల కారణంగా వెనక్కు వెళ్లిపోయాయి. ఈ నోట్లను అర్భీఐ కాకుండా కేంద్ర ప్రభుత్వే పలు ప్రాంతాలలో రహస్యంగా ముద్రణకు అనుమతించిందని, ఈ విషయంలో ప్రజలు అర్భీఐని తప్పుబట్టడం సమంజసం కాదని కూడా అర్భీఐ అధికారులు వెల్లడించారు.

ఇదిలావుంటూ ఈ నోటను దక్కిన హైదరాబాద్ శంకరమఠంకు చెందిన సాయికృష్ణ ఆజాద్‌ అనే హైకోర్టు న్యాయవాది అయోమయ స్థితికి లోనయ్యారు. ఏటీఎం నుంచి  డ్రా చేసిన రూ. 500 నోటు చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆ నోటును నీళ్లలోంచి తీసి..తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టారు. ఐదు నిమిషాలు తరువాత చూడగా  ఆ నోటు రంగు వెలిసి నోటు ఆనవాళ్లు కోల్పోయింది. నోటులోని జాతిపిత గాంధీ బొమ్మతో పాటు ఇతర అక్షరాలు రూపం కోల్పోపోయాయి. దీంతో ఖంగుతిన్న అతను నోటు అసలా. నకిలీదా అని అయోమయస్థితికి చేరాడు. ఏటీయం నుంచి డ్రా చేసిన నోటు ఇలా మారిందని ఆందోళన వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 500 note  waterproof  quality test  Advocate  sai krishna azad  gandhiji emblem  colour  letters  fake note  

Other Articles