కేసీఆర్ కలకు కేంద్రం చెక్ | No funds for Mission Kakatiya from Central.

Central not ready to funding mission kakatiya

Mission Kakatiya, Central Funds, No funds for Mission Kakatiya, Mission kakatiya stopped, Central shocks to KCR, Central government Mission Kaktiya

Central says no funds for Telangana govt's 'Mission Kakatiya' .

మిషన్ కాకతీయ నిధులకు కేంద్రం నో!

Posted: 12/02/2016 04:49 PM IST
Central not ready to funding mission kakatiya

తెలంగాణ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకునే మిషన్ కాకతీయకు పెద్ద షాక్ తగిలింది. నిధులు విడుదల చేయటం కుదరదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ కోసం మన ఊరు మన చెరువు అన్న ట్యాగ్ లైన్ తో  ఏర్పాటు చేసిన ఈ ప్రతిష్టాత్మక పథకం కోసం ట్రిపుల్ ఆర్ (రిపేర్ - రినోవేషన్ - రిస్టోరేషన్) కింద గతేడాది రూ.44.87 కోట్ల మేర నిధులను విడుదల చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మరిన్ని నిధులు అవసరమని లోక్ సభ ఎంపీ బూర నర్సయ్య లోసభలో లో లేవనెత్తాడు.

అయితే ప్రత్యేక ఆర్థిక సాయం పద్దు కింద నిధులు విడుదల చేయాలన్న ఆయన విజ్నప్తిని కేంద్రం తోసిపుచ్చింది. మిషన్ కాకతీయకు నిధులివ్వలేమని జలవనరుల శాఖ సహాయమంత్రి సంజీవ్ బాల్యన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చాడు. వచ్చే మూడేళ్లలో మిషన్ కాకతీయకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా నీతి ఆయోగ్ సిఫారసు చేసిందని నర్సయ్య గుర్తుచేయగా, ప్రత్యేక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన ఆర్థికసాయం చేయడం సాధ్యం కాదని సంజీవ్ తెలిపారు.

అంతేకాదు మిషన్ కాకతీయ యాక్సెలెరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ (ఏఐబీపీ) కింద తీసుకురావాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణకు గతేడాదే నిధులను విడుదల చేసిన విషయాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించాడు. కాగా, జనవరి నుంచి మూడో దశ పనులను ప్రారంభించేందుకు టీ సర్కార్ ఇప్పటికే సిద్ధంగా ఉంది.

మరోవైపు నోట్లరద్దు తదనంతర పరిణామాలపై అన్ని పార్టీల నేతలతో సంప్రదింపులు జరిపి ప్రతిష్టంభనను తొలగించాలని టీఆర్ ఎస్ శాసనసభాపక్ష నేత జితేందర్ రెడ్డి విజ్ఞఫ్తి చేశారు. లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించడంలేదని అమలవుతున్న విధానం తదనంతరం ఏర్పడిన పరిస్థితులపైనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు. ప్రతిష్టంభనను తొలగించడానికి మధ్యేమార్గంగా బీజేడీకి చెందిన భర్తృహరి మహతాబ్ వంటివారి ద్వారా ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరిపి ఏ నిబంధన కింద చర్చ జరపవచ్చో ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mission Kakatiya  Central  no funds  

Other Articles