మహిళను రూ.2 కోట్లు డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లు Cyber scammers threaten MP woman, demand Rs 2 cr

Cyber scammers threaten mp woman demand rs 2 cr in bitcoins or they post her pics on porn sites

Pornographic websites, obscene sites, Jabalpur, Philippines, Rs 2 crore Bitcoins , bhopal, cyber crime, porn sites, Bitcoins, MP woman, ransom, India News, Crime News

cyber scammers have threatened a 30-year-old woman in Jabalpur district to pay up Rs 2 crore in Bitcoins to keep them from uploading her pictures on pornographic websites.

మహిళను రూ.2 కోట్లు డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లు

Posted: 12/02/2016 03:07 PM IST
Cyber scammers threaten mp woman demand rs 2 cr in bitcoins or they post her pics on porn sites

కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ఇండియా.. డిజిటల్ మనీ అన్న పదాలను వినిసిస్తున్న వేళ.. ఆ దిశగా తీసుకున్న భద్రతా చర్యలు ఎలా వున్నాయి.. సైబర్ సెక్యూరిటీ దేశంలో ఎలా వుంది అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇటీవల దేశానికి చెందిన ప్రముఖ బ్యాంకులకు సంబంధించిన 60 లక్షల మంది డెబిట్ కార్డుల జాబితాను పాకిస్థాన్ కు చెందిన సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన నేపథ్యంలో పలు కొత్త అనుమానాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ తరుణంలో దేశంలోని సైబర్ సెక్యూరిటీని ప్రశ్నించే విధంగా ఓ మధ్యప్రదేశ్ యువతికి ఎదురైన ఘటన కూడా సవాలు విసురుతుంది.

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ జిల్లాలో ఓ 30 ఏళ్ల మహిళకు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులు వచ్చాయి. అమెకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తాము హ్యాక్ చేసిన రాబట్టామని, వీటితో పాటు అమె నగ్న ఫోటోలు అన్నింటినీ కూడా తాము పొందామని, వీటిని యధాతథంగా వుంచాలంటే తాము కోరినట్టుగా రెండు కోట్ల రూపాయలను బిట్ కాయిన్ల రూపంలో తమకు పంపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అగంతకులు అమెకు ఈ మెయిల్ ద్వారా హెచ్చరికలు పంపారు.

తాము కోరినట్టు డబ్బును ఇవ్వని పక్షంలో అమె నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో వున్న మిత్రులతో పాటు అమె కుటుంబసభ్యులకు, స్నేహితులకు పంపుతామని హెచ్చరించారు. దీంతో పాటు ఫొటోలను వరుసపెట్టి పోర్నోగ్రాఫిక్ సైట్లలో పెడుతూనే ఉంటామని హెచ్చరించారు. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఈమెయిల్ ఫిలిప్పీన్స్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జబల్పూర్ ఎస్పీ ఆశిష్ తెలిపారు. ఓపెద్ద కుటుంబానికి చెందిన ఆ మహిళ.. ఈ తరహా ఈమెయిల్ రావడంతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
 
ఆమె వ్యక్తిగత సమాచారం, నగ్న ఫొటోలు అన్నింటినీ ఆమె సోషల్ మీడియా కాంటాక్టులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు చేరవేయడంతో పాటు పోర్న్ సైట్లలో కూడా పెడతామని.. ఇదంతా జరగకూడదంటే బిట్‌కాయిన్ల రూపంలో 2 కోట్లు చెల్లించాలని ఆ ఈ మెయిల్‌లో పేర్కొన్నారు. పైగా అందుకు పెద్ద సమయం కూడా ఇవ్వలేదని ఎస్పీ చెప్పారు. అయితే ఇలాంటి కేసులను విచారించడం అంత సులభంగా అయ్యే పని కాదని పోలీసలు అంగీకరించారు. నిందితులు టీఓఆర్ బ్రౌజర్లు వాడటం వల్ల వాళ్ల సెర్వర్లు ఎక్కడున్నాయో గుర్తించడం కష్టమని, అలాగే బిట్‌కాయిన్ల రూపంలో చెల్లింపు వల్ల దాన్ని ట్రేస్ చేయడం మరింత క్లిష్టమని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyber crime  porn sites  Bitcoins  MP woman  ransom  India News  Crime News  

Other Articles