జవాన్ల మృతికి ప్రతీకారం తీర్చుకుంటాం: భారత ఆర్మీ India Vows 'Heavy Retribution' After Soldier Is Mutilated By Pakistan, 2 Killed

Militants mutilate soldier s body kill 2 other armymen india vows retribution

soldiers killed, army men killed, army, indian army, jammu and kashmir, soldiers killed, jammu kashmir, kashmir, kashmir encounter, j&k, terrorist encounter, army, indian army, mutilated, indian express, machhal, india news

An angry Indian Army threatened “retribution” after suspected Pakistani troops killed three soldiers and savagely mutilated one of the bodies on Tuesday close to the border in Jammu and Kashmir.

పాక్ సైన్యం దుశ్చర్య.. ప్రతీకారం తప్పదన్న ఆర్మీ

Posted: 11/23/2016 10:39 AM IST
Militants mutilate soldier s body kill 2 other armymen india vows retribution

భారత సరిహద్దులో ప్రశాంత వాతావరణం నెలకొనడానికి ఏమాత్రం ఇష్టంలేని దాయాధి పాకిస్థాన్.. ఒక వైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ.. తీవ్రవాదం వేళ్లూనూకునే చర్యలకు పాల్పడుతూనే.. మరో వైపు వారిని అక్రమ చోరబాట్లకు కూడా సహకరిస్తూ.. సరిహద్దులో పహారా కాస్తున్న భారతీయ జవాన్లపైకి కాల్పులతో తెగబడుతున్నారు. భారత సర్జికల్ స్ట్రైక్ తో భారతీయ జవాన్లు పాకిస్తాన్ ప్రభుత్వానికి ముందస్తు సమాచారం అందించి.. వారి భూభాగంలోకి వెళ్లి మారీ ఉగ్రవాద శిభిరాలపై దాడులను కొనసాగించన నాటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న పాక్‌ సైనికులు దారుణాతి దారుణ చర్యలకు పాల్పడుతున్నారు.

పాకిస్థాన్ సైనికుల చేతిలో ముగ్గురు భారతీయ జవాన్లు వీరమరణం పోందారు. కాల్పుల్లో మరణించిన భారత జవాను మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరికి వికృతానందాన్ని పాల్పడ్డారు. సర్జికల్ స్ట్రైక్స్ తరువాత పాకిస్తాన్ సేనలు భారత జవాను మృతదేహాన్ని ఇలా ముక్కముక్కలు చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు సిపాయి మన్‌దీప్‌ సింగ్‌ మృతదేహాన్ని కూడా పాక్‌ ఉగ్రవాదులు ఇలాగే ఛిద్రం చేశారు. కాగా దీనిపై స్పందించిన భారత ఆర్మీ.. ఖచ్చితంగా దీనికి ప్రతీకారాన్నీ తీర్చుకుంటామని స్పష్టం చేసింది. దీంతో జడిసిన పాక్ సేనలు తాము భారత జవాను మృతదేహాన్ని ముక్కలు చేయలేదని ప్రకటించింది.

కశ్మీర్‌లోని మచ్చల్‌ సెక్టర్‌లో నియంత్రణ రేఖ వెంబడి గత సాయంత్రం నుంచి పాక్‌ దళాలు విచక్షణ రహితంగా కాల్పులు జరిపాయి. పాక్‌ సైనికులు, ఆర్మీ మద్దతు ఇచ్చే ఉగ్రవాదులతో కూడి ఉండే బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ (బ్యాట్‌) ఈ కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ముగ్గురు భారత సైనికులు అమరులయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని పాక్‌ సైనికులు స్వాధీనం చేసుకున్నారు. దానిని ముక్కముక్కలుగా ఛిద్రం చేసి మరీ భారత సరిహద్దుల్లో వదిలేశారు. తామూ సంప్రదాయ యుద్ధం చేయగలమని పాక్‌ ఆర్మీ చీఫ్‌ రహీల్‌ షరీఫ్‌ హెచ్చరించిన నేపథ్యంలో జరిగిన తాజా దాడిని భారత తీవ్రంగా పరిగణించింది.

ఈనెల 29వ తేదీన రహీల్‌ పదవీ విరమణ చేయనుండడంతో పాక్‌ దళాలు వికృతంగా ప్రవర్తిస్తున్నాయి. కాగా, పాక్‌ దళాల వికృతత్వంపై కేంద్ర రక్షణ మంత్రి మనోహర్‌ పర్రీకర్‌కు లెఫ్టినెంట్‌ జనరల్‌ బిపిన్‌ రావత తెలిపారు. దాంతో, అంతకు వందింతలు దెబ్బతీయాలని, ఈసారి దాడి అత్యంత తీవ్రంగా ఉండేలా చూడాలని సైన్యానికి పర్రీకర్‌ సూచించినట్లు సమాచారం. మరోవైపు, జమ్మూ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంట జరిగిన కాల్పుల్లో ఓ పాక్‌ చొరబాటుదారుణ్ణి.. బీఎస్‌ఎఫ్‌ దళాలు కాల్చి చంపాయి. దట్టమైన మంచు దిబ్బలను చాటు చేసుకొని, అతడు చొరబాటుకు ప్రయత్నించగా, సైన్యం మట్టుబెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Militant attack  Indian Army  Soldiers killed  Soldier's mutilated body  Line of Control  

Other Articles

Today on Telugu Wishesh