తగ్గేది లేదు: బుల్లెట్ ఫ్రూఫ్ బాత్ రూం.. 24/7 సెక్యూరిటీతో కొత్త ఇల్లు | KCR to shift in to new house.

Telangana cm to enter his dream house

KCR, KCR New Camp Office, KCR dream house, KCR Begumpet House, K. Chandra Shekar Rao. Bullet Proof Bathroom for KCR, KCR New House, Bullet Proof Bathroom, Telangana CM New House, New Camp Office, KCR new Camp Office, KCR New House, KCR new Office, KCR camp office

KCR to step into swanky home office on November 24.

కలల సౌధంలోకి కేసీఆర్.. రేపే ముహుర్తం

Posted: 11/23/2016 11:01 AM IST
Telangana cm to enter his dream house

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొత్త ఇంటి ప్రవేశానికి ముహుర్తం కుదిరింది. గురువారం ఉదయం 5 గంటలకు సతీసమేతంగా ఆయన కొత్త ఇంట్లో అడుగుపెట్టనున్నాడు. బేగంపేట లోని క్యాంప్ ఆఫీస్ వెనకాల ఉన్న 9 ఎకరాలలో ఈ నిర్మాణం చేపట్టారు. క్యాంపు ఆఫీస్, నివాస భవనంతోపాటు, ప్రత్యేకంగా ఓ మీటింగ్ హాల్ నిర్మించారు. మొత్తం లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమైన భవంతిలో వెంటిలేటర్లు, కిటికీలు సహా అన్ని అద్దాలనూ కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేశారు. ఇందుకోసం దాదాపు 38 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం.

భవంతిలో తాను వినియోగించే బాత్ రూమ్ ను సైతం బులెట్ ఫ్రూఫ్ గా కేసీఆర్ తయారు చేయించుకున్నారు. సుదూర ప్రాంతం నుంచి స్నిప్పర్ రైఫిల్ ద్వారా వచ్చే బులెట్లను అడ్డుకునేందుకే బులెట్ ప్రూఫ్ గ్లాస్ లను ఏర్పాటు చేయాలని నిఘా వర్గాలు సూచించినట్టు తెలుస్తోంది. దీంతో బులెట్లు తగిలినా చెక్కు చెదరని అద్దాలతో ఈ బాత్ రూం నిర్మితమైనట్టు తెలుస్తోంది.

ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సూచనల మేరకు కేసీఆర్ తోపాటు తనయుడు, మంత్రి కేటీఆర్ వినియోగించే డబుల్ బెడ్ రూం గదులను సైతం హై క్వాలిటీ గ్లాస్ తో కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇక అత్యాధునిక ఆయుధాలను చేతుల్లో కలిగుండే భద్రతా దళాలు, మందుపాతరలతో పేల్చినా ప్రమాదం జరగని కార్లు, జడ్ ప్లస్ సెక్యూరిటీని ఆయనకు కల్పించనున్నారు.

ముఖ్య‌మంత్రి సూచ‌న మేర‌కు వివిధ ర‌కాల మొక్క‌లు సేక‌రించి ప్రాంగ‌ణంలో నాటారు. మూడు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ తిరిగి చేరుకున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం సాయంత్రం గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌ను క‌లిసి గృహ‌ప్రవేశానికి ఆహ్వానించాడు కూడా. వాస్తు రీత్యా ఇప్పుడున్న భవనం అంత అనుకూలంగా లేదని, కొత్త భవనం కోసం నిర్మాణ ప‌నులు ప్రారంభించిన 9 నెల‌ల్లోనే ప‌నులు పూర్తి చేయ‌డం విశేషం.

KCR dream house

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  New Camp Office  KCR  New House  Bullet Proof Bathroom  

Other Articles