రిలయన్స్ జియో బ్రహ్మాండమైన బంఫర్ అఫర్ R-Com takes on Reliance Jio, offers unlimited voice plan for Rs149 a month

R com takes on reliance jio offers unlimited voice plan for rs149 a month

Jio mobile plan, Reliance Jio, reliance communications, jio mobile plan offers, jio rs 149 voice calling offer, Reliance Jio 4g smart phones, Reliance Jio cheapest 4g phones, Jio 4g smart phones, Jio cheapest 4g phones, unlimited voice, Jio Broadband services, Jio fiber optic cables, Jio FTTH, Jio Mediashare, Jio TV, Reliance Jio internet, reliance, jio, smartphones, mobiles

R-Com’s unlimited voice plan at Rs149 also includes 300MB of data usage for all its customers as the telco seeks to bundle voice and data

జియో పంబరేపడానికి రిలయన్స్ బ్రహ్మాండమైన బంఫర్ అఫర్

Posted: 11/23/2016 09:44 AM IST
R com takes on reliance jio offers unlimited voice plan for rs149 a month

4జీ మొబైల్‌ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీ రంగాన్ని ఒక కుదుపు కుదిపేసిన రిలయన్స్ జియోకు.. సోదర సంస్థ నుంచే పోటీ ఎదురైంది. ఉచిత కాల్స్, ఉచిత డేటాతో ఒక్కసారిగా పోటీదారులకు కునుకును కరువు చేసిన రిలయన్స్‌ జియో లేటుగా వచ్చినా.. లేటెస్టుగా వస్తామన్నట్లు లేటుగా మార్కెట్లోకి వచ్చినా.. టెలీ కమ్యూనికేషన్స్ రంగంలో పెను సంచలనాలకు కారణమైంది. డిసెంబర్ మాసంలో అత్యంత చౌవకైన 4జీ ఫోన్లను కూడా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంతో పోటీదారులు జియోను అడ్డకునేందుకు వేస్తున్న ప్రణాళికలన్నీ చిత్తవుతున్నాయి.

ఈ తరుణంలో తన సోదరుడికి చెందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ అర్ కామ్ నుంచి రిలయన్స్ జియోకు భారీగా చెక్ పడనుంది. దీనికి కారణం రిలయన్స్ కమ్యూనికేషన్ ప్రకటించిన బ్రహ్మాండమైన బంఫర్ ఆఫర్. ఆర్ కామ్ ప్రకటించిన బంఫర్ అఫర్ లో అత్యంత చౌక ధరకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం 149 రూపాయల రీచార్జ్ తో కస్టమర్లు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్లాన్ ను వినియోగించుకునే వెసులుబాటు ఈ ప్లాన్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది.

అయితే ఈ ప్లాన్ ప్రకారం కేవలం రిలయన్స్ టు రిలయన్స్ ఫోన్లు మాత్రమే కాకుండా.. రిలయన్స్ నుంచి ఏ మోబైల్ ఫోన్ కైనా కాల్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అంతేకాదండీ ఈ ఆఫర్ కింద లోకల్ తోబాటు ఎస్టీడీ పోన్లను కూడా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తాజా ప్లాన్‌లో 2జీ/3జీ/4జీ యూజర్లు దేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అన్‌లిమిటెడ్‌గా కాల్స్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

దేశంలోని అధిక సంఖ్యలో వున్న 2జీ, 3జీ యూజర్లను తమ నెట్‌వర్క్ పరిధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఈ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఇక మరోవైపు ఈ అపరిమిత ప్లాన్ వినియోగదారులకు మరో బంపర్ అఫర్ కూడా ప్రకటించింది ఆర్ కామ్. అదేంటంటే..ఈ ప్లాన్ లో చేరిన వినియోగదారులకు అదనంగా 300 ఎంబీ డేటాను పొందొచ్చని పేర్కొంది. జియో కూడా ఉచిత కాల్స్‌ను అందిస్తోంది కదా అంటే ఆ సౌలభ్యం కేవలం వీఓఎల్‌టీఈ సపోర్ట్ 4జీ హ్యాండ్‌సెట్స్‌కు మాత్రమే అందుబాటులో ఉందన్న విషయాన్ని గుర్తించాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles