రూ. 1000 నోటుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ No rollback of currency ban, some CMs spreading panic: Arun Jaitley

No rollback of currency ban some cms spreading panic arun jaitley

banks, bank managment, Arun jaitley, cm kcr, DEA, Secretary Shaktikanta Das, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Finance Minister Arun Jaitley ruled out roll back of the demonetisation decision and slammed Delhi and West Bengal chief ministers accusing them of spreading "unnecessary panic".

రూ. 1000 నోటుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

Posted: 11/17/2016 06:33 PM IST
No rollback of currency ban some cms spreading panic arun jaitley

న‌ల్ల‌ధ‌నం, న‌కిలీ నోట్ల‌ను అరిక‌ట్ట‌ే చర్యల్లో ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయంగా పేర్కోంటున్న ఎకానమీ సర్జికల్ స్ట్రైక్ పై రోజుకో మాటతో ప్రజలను తీవ్ర అందోళనకు గురిచేస్తుంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒకలా, ఆర్బీఐ అధికారుల మరోలా చేస్తున్న ప్రకటనలతో ప్రజలు ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదన్న విషయంలో క్లారిటీ లోపించింది. పాత 500, 1000 రూపాయ‌ల నోట్ల‌ను ర‌ద్దు చేసిన ప్ర‌భుత్వం ఇప్ప‌టికే కొత్త 2000, 500 నోట్ల‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే.

దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర చిల్లర సమస్య ఉత్పన్నమైంది. ఈ తరునంలో మళ్లీ తెరపైకి వచ్చిన కేంద్రం.. అన్ని బ్యాంకులకు కొత్తగా డిజైన్ చేసిన 500 రూపాయల నోట్లను కూడా పంపామని, త్వరలోనే నూతనంగా డిజైన్ చేసిన రూ.1000 నోటును కూడా తీసుకువస్తామని చెప్పారు. దీంతో దేశంలో ఉత్పన్నమైన చిల్లర సమస్య పరిష్కారం అవుతుందని భావించిన ప్రజలకు ఇవాళ కేంద్ర అర్థిక శాఖ మంత్రి ఇచ్చిన కార్లిటీతో అది కాస్తా సన్నగిల్లింది.

కొత్త డిజైన్‌తో వెయ్యి రూపాయల నోట్లను విడుదల చేసే ఆలోచన ప్ర‌స్తుతం త‌మ‌కు లేద‌ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తేల్చిచెప్పారు. దేశంలో ఉన్న 2 లక్షల ఏటీఎం మిషన్లలో సుమారు 22,500 ఏటీఎంలకు ఈ రోజు రూ.2000 నోట్ల కోసం సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసిన‌ట్లు చెప్పారు. వాటిల్లో ఇక‌ నుంచి కొత్త రూ. 2000 నోట్ల‌తో పాటు అన్ని నోట్ల‌ను విత్‌డ్రా చేసుకోవ‌చ్చ‌ని చెప్పారు. బ్యాంకులలో పాత నోట్ల మార్పిడిని రూ. 4500 నుంచి రూ.2 వేలకు త‌గ్గించిన అంశంపై ఆయ‌న మాట్లాడుతూ... అందుబాటులో ఉన్న‌ నిధుల దుర్వినియోగం జరగకూడదనే తాము నోట్ల మార్పిడిని రూ.2000 కు త‌గ్గించిన‌ట్లు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 500. Rs 1000  Rs 2000 new note  Arun jaitley  pm modi  Reserve bank of India  

Other Articles