మరో దక్షిణాధి నటి అనుమానాస్పద మృతి Malayalam actor Rekha Mohan found dead in Thrissur flat

Malayalam actress rekha mohan found dead in her thrissur apartment

Malayalam actress, Rekha Mohan, rekha mohan death, rekha mohan suspicious death, actress suspicious death, actress dead in apartment, mollywood, Sabarna Anand aka Suguna, Kollywood actress suicide, Kollywood actress suspicious death

Rekha was known for her roles in films like Udyanapalakan, Yathramozhi and Ne Varuvolam. She also had a popular small-screen appearance in serial Mayamma.

మరో దక్షిణాధి నటి అనుమానాస్పద మృతి

Posted: 11/13/2016 09:17 AM IST
Malayalam actress rekha mohan found dead in her thrissur apartment

దక్షిణాది చిత్రపరిశ్రమలో నటీమణుల అనుమానాస్పద మృతులు కలవరాన్ని రేకెత్తిస్తున్నాయి. కాలీవుడ్ కు చెందిన 29 ఏళ్ల నటి సబర్న ఆనంద్ అలియాస్  సుగుణ అనుమానాస్పద మృతి చెంది 48 గంటలు కూడా గడవక ముందే దక్షిణాదికి చెందిన మరో నటి కూడా అనుమానాస్పద స్థితిలో మృతిచెందిడంలో అందోళన రేకెత్తుతుంది. మాలీవుడ్ కు చెందిన సినీనటి, టీవీ నటి రేఖా మోహన్ త్రిసూర్ లోని అపార్టుమెంటులో మరణించివుండటాన్ని గుర్తించారు. తన సోంత అపార్టుమెంటులోనే రేఖ మరణించి వుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

రేఖ మృతికి కారణమేంటన్నది తెలియరాలేదని చెబుతున్న.. పోలీసులు అన్ని కోణంలో విచారణ చేస్తున్నారు. ఆమె పలు మలయాళీ సినిమాలు, టీవీ సీరియల్‌లో నటించింది. ఇంటికి దూరంగా ఉన్న రేఖ భర్త గత రెండు రోజులుగా ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఆయనకు సందేహం వచ్చి త్రిసూర్‌ పోలీసుల సాయం కోరాడు. పోలీసులు రేఖ అపార్ట్‌మెంట్‌కు వెళ్లి తలుపులు పగలకొట్టి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. అపార్ట్‌మెంట్‌ లోపల లాక్‌ చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు.

రేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం త్రిసూర్‌ మెడికల్‌ కాలేజీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమిళ సినీ పరిశ్రమలోనూ రెండు రోజుల క్రితం ఇలాగే విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నటి సబర్ణ చైన్నైలోని తన ఫ్లాట్‌లో మరణించినట్టు పోలీసులు కనుగొన్నారు. మూడు రోజుల క్రితం చనిపోయినట్టు తెలిపారు. ఆమె లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles