చైనాపై డోనాల్డ్ ట్రంప్ అసక్తికర వ్యాఖ్యలు Trump is about to hand China a lovely present

China sees trump election as a trade opportunity

US President elect, Donald Trump, Republican party, Chinese President, Xi Jinping, Politics, moneygame, clusterstock

Donald Trump has said a lot about how he plans to punish China as president, with some of the ideas more likely to happen than others

చైనాపై డోనాల్డ్ ట్రంప్ అసక్తికర వ్యాఖ్యలు

Posted: 11/12/2016 05:36 PM IST
China sees trump election as a trade opportunity

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలలో గెలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ పగ్గాలు చేపట్టకుండానే చైనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చైనాపై తన ఎన్నికల ప్రచారం కారాలు మిరియాలు నూరిన ట్రంప్ ఎన్నికలు ముగిసిన తరువాత కూడా చైనా పట్ల వ్యతిరేకతను ఏమాత్రం దాచుకోకుండా బయట పెట్టాడు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికలలో గెలుపోందిన తరువాత తాను చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌తో మాట్లాడలేది ట్రంప్‌ చెప్పారు. జిన్‌ పింగ్‌తో మాట్లాడినట్టు మీడియాలో వచ్చిన కథనాలను తోసిపుచ్చారు.

ట్రంప్‌ విజయం సాధించాక చైనా అధ్యక్షుడు ఫోన్‌ చేసి ఆయన్ను అభినందించినట్టు చైనా సెంట్రల్‌ టీవీ వెల్లడించింది. ట్రంప్‌కు ఫోన్‌ చేసి అభినందించానని, ఇరు దేశాలు కలసి పనిచేయాల్సిన అవసరముందని చెప్పానని జిన్‌ పింగ్‌ తెలిపారంటూ ఆ టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. చైనా-అమెరికా సంబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అభివృద్ధి దిశగా దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలని ట్రంప్‌తో జిన్‌ పింగ్‌ చెప్పినట‍్టు వెల్లడించింది.

అలాగే ఇరు దేశాల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారని చైనా సెంట్రల్‌ టీవీ పేర్కొంది. కాగా వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌తో ట్రంప్‌ మాట్లాడుతూ.. చైనా అధ్యక్షుడితో తప్ప చాలా మంది ప్రపంచ నేతలతో మాట్లాడానని, అభినందనలు అందుకున్నానని చెప్పారు. ట్రంప్‌ ప్రతినిధి హోప్‌ హిక్స్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఎన్నికలకు ముందు ఓ ర్యాలీలో ట్రంప్‌ మాట్లాడుతూ.. చైనా అమెరికా ఉద్యోగాలను దోచుకుంటోందని, తమ దేశాన్ని అత్యాచారం చేస్తోందని, ఇకమీదట సాగబోదని తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా, చైనా సంబంధాలు ఎలా ఉండబోతాయన్నది ఇతర దేశాలు గమినిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : US President elect  Donald Trump  Chinese President  Xi Jinping  

Other Articles