ప్రజలు ప్రభుత్వాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు.. జాగ్రత్తా..! Uddhav slams Centre for 'leaving poor man in a lurch'

Get set to face public s surgical strike shiv sena to centre

Rs 500. Rs 1000, surgical strike, Swiss banks, Uddhav Thackeray, BJP, Shiv Sena, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, Rs 500,500 rupees note,1000 Rs Note,Rs 2000 new note, BJP alerted its friends on notes, Demonitization, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

Man throws away Rs 1000 notes from a speeding car, locals watched notes on road and compete each other to collect them

ప్రజలు ప్రభుత్వాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారు.. జాగ్రత్తా..!

Posted: 11/12/2016 04:54 PM IST
Get set to face public s surgical strike shiv sena to centre

పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై శివసేన మండిపడింది. దేశంలో వున్న సామాన్య ప్రజలపై ప్రధాని మోదీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తున్నారని... ఇదే రకపు సర్జికల్ స్ట్రైక్స్ స్విస్ బ్యాంకుపై చేయాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. నల్లధనం పెద్ద మొత్తంలో దాగివున్న స్విస్ బ్యాంకులను వదిలి దేశంలోని సామాన్యులను పూర్తిగా ఇబ్బందుల పాలు చేయడానికి కేంద్రం ప్రభుత్వం సిద్దం కావడం సబబు కాదని విమర్శించారు.

నల్లధనం వెలికితీతకు ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని తాను వ్యతిరేకించడం లేదని, కానీ అమలు చేసే పద్ధతే సరియైనది కాదన్నారు. పెద్ద నోట్ల రద్దుచేస్తూ ప్రధాని వెల్లడించిన నిర్ణయంతో సామాన్య ప్రజలు అవస్తలు పాలవుతున్నారని విమర్శించారు. ప్రజలు మనకి ఓటేసిన సంగతి మరచిపోకూడదు. ఇది ఇలానే కొనసాగిస్తే.. ప్రజలు మనపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని హెచ్చరించారు. దబార్లో శివసేన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఈ విషయాలు తెలిపారు.
 
తరుచూ ప్రజలతో మన్ కీ బాత్ నిర్వహించే మోదీ.. ప్రజల మాటను మరచిపోయి.. ధన్ కీ బాత్ ఎంపికచేసుకున్నట్టు వున్నారని వ్యాఖ్యానించారు.. వేల కొద్దీ స్విస్ బ్యాంకు అకౌంట్లలో దాగిఉన్న బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని మోదీని డిమాండ్ చేశారు. స్విస్ బ్యాంకులో ఉన్న డిపాజిట్లపై బ్లాక్ మనీపై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడే మోదీ చర్యలకు బలం చేకూరుతుందని పేర్కొన్నారు.

నల్లధనంపై ఉక్కుపాదం మోపండి, కానీ సామాన్య ప్రజలపై కాదని సలహా ఇచ్చారు. ప్రజలకోసం మంచి చేస్తున్నట్టు చూపిస్తూనే, మరోవైపు ప్రజల సొంత డబ్బుతోనే వారిని చిత్రహింసలు పెడుతున్నట్టు ఆరోపించారు. ఆసుపత్రి బిల్లులు చెల్లించడానికి కూడా వారి దగ్గర డబ్బు లేదని, పెళ్లిళ్లూ ఆగిపోయాయని చెప్పారు. బ్యాంకు క్యూలో నిల్చుని ఓ సీనియర్ సిటిజన్ మరణించడంతో, ఆయన మృతికి ఎవరు బాధ్యులని ఠాక్రే ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rs 500. Rs 1000  surgical strike  Swiss banks  Uddhav Thackeray  BJP  Shiv Sena  PM Modi  

Other Articles