డాన్సర్లతో ఎమ్మెల్యే చిందులు.. అసభ్య ప్రవర్తన.. SP MLA Jagatram Paswan ‘showers money’ on dancers

Samajwadi party mla jagatram paswan showers money on dancers

samajwadi party, jagatram paswan, jagatram paswan dance, jagatram paswan dancers, jagatram paswan video, sp mla jagatram paswan, uttar pradesh news, india news, viral video, trending video

The video, which is also being aired on some local channels, shows the MLA allegedly showering currency notes on dancers at a wedding function.

ITEMVIDEOS: డాన్సర్లతో అధికారపార్టీ ఎమ్మెల్యే చిందులు.. అసభ్య ప్రవర్తన..

Posted: 10/19/2016 04:46 PM IST
Samajwadi party mla jagatram paswan showers money on dancers

అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే అయితే అడ్డు అదుపు లేనట్లే. ఎందుకంటే.. చేతిలో పవర్ వుంటుంది.. పనిచేసే మంత్రులు, చట్టం, అధికారులు ఇలా ఒక్కటేమిటి.. అన్ని వుంటాయి. అయితే ఇదే అదనుగా చేసుకుని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ సత్తాను చాటే పనిలో వుంటారు. పలు సందర్భాలలో తమ వారో లేక తామో చట్టాన్ని అతిక్రమించినా పోలీసుల సైతం పట్టించుకోరు. ఇక దీనితో అవకాశం దొరికినప్పుడల్లా తమ అధికార పార్టీ ప్రభావం ఎలా వుంటుందో ప్రజలకు. ముఖ్యంగా తన నియోజకవర్గ అనూయాయువులకు చూసుతుంటారు.

అచ్చంగా అలాగే చెసి బుక్కయ్యాడు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా, అయన గారు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పైగా ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన డాన్సర్లతో కలసి చిందేశారు. అంతేకాదండోయ్ వారితో అసభ్యంగా కూడా ప్రవర్తించారు. నలుగురు వున్నారన్న ధ్యాస లేకుండా.. చూస్తున్నారన్న సోయికూడా లేకుండా డాన్సర్ల లో దుస్తుల్లో డబ్బులు పెట్టారు.

ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నికల సమీపిస్తున్న వేళ అ అధికార ఎమ్మెల్యేను విపక్షాలు నిలదీసి దీనిని ఒక అంశంగా ూడా మార్చాయి. ఈ వ్యవహారంపై ముప్పేట దాడికి దిగాయి. కొన్ని స్థానిక టీవీ చానళ్లలో కూడా ఈ వీడియో ప్రసారమైంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జగత్‌రామ్ పాశ్వాన్ అనే ఈ ఎమ్మెల్యే ఓ పెళ్లికి హాజరై.. అక్కడ డాన్సు చేస్తున్న యువతుల మీదకు కరెన్సీ నోట్లు విసరడంతో పాటు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు.
 
దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగాయి. సమాజ్‌వాదీ పార్టీ అగ్రనాయకత్వం వాళ్లలో వాళ్లే తన్నుకోవడంలో బిజీగా మారిపోతే.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు డాన్సర్ల మీద నోట్లు చల్లుతూ ఆనందం పొందుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ గూండాలు, మాఫియా శక్తులతో నిండిపోయిందని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ ప్రకాష్ సింగ్ మండిపడ్డారు. ఆ పార్టీ అసలు లక్షణం ఇప్పుడు వీడియో రూపంలో బయటకు వచ్చిందని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యకలాపాల్లోనే ఉంటున్నారని పీస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మన్నన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samajwadi party  jagatram paswan  dancers  wedding  uttar pradesh  viral video  

Other Articles