మేకప్ మోసం.. భార్య ముఖం చూసి విడుకాలిచ్చిన భర్త man divorces wife seeing her first time without make-up

Arab man divorces wife seeing her first time without make up

groom divorced bride, bride natural face, Sharjah beach, divorce, uae couple, newly married couple, united arab emirates, psychologist, features change, false eyelashes, cosmetic surgeries, Dr. abdul aziz, viral news

A groom divorced his bride after he saw her face without cosmetics for the first time. He accused her of deceiving him by wearing a lot of make-up, fake eyelashes and coloured contacts

భార్య ముఖం చూసి భర్త షాక్..! విడుకాలిచ్చిసాడోచ్..!!

Posted: 10/19/2016 05:59 PM IST
Arab man divorces wife seeing her first time without make up

పెళ్లి చూపులకు వెళ్లాడు.. అమ్మాయిని చూశాడు. అమె అందంగా వుందని ఉబ్బతబ్బిబయ్యాడు. అమె అందమంతా తన సోంతం అవుతుందని, అమె తనకు భార్య కావాలని భావించాడు. తన తరపు పెద్దలతో విషయాన్ని చెప్పి నిఖా చేసుకున్నాడు. పెళ్లి సమయంలోను అమె అందంతో పిచ్చెక్కిపోయిందతనికి. పెళ్లికి వచ్చిన మిత్రులు, బంధువెులలో తన వయస్సు వారందరూ.. అహా భలే అందెగత్తెను నీ భార్యగా చేసుకున్నావు..రా.. అంటూ పొడుగుతుంటే.. గాల్లో తేలినట్లుందే.. అన్న పాటను కూడా పాడేసుకున్నాడు.

ఇలా అరు నెలలు గడించింది. భార్యతో కలసి సరదాగా సౌదీలోని ఓ బీచ్ కు వెళ్లాడు.. అక్కడ ఇటీవలే పెళ్లైన ఈ కొత్త జంట సముద్రంలో సరదాగా స్విమ్మింగ్ కు వెళ్లారు. దాంతో అమె మేకప్ మొత్తం చెదిరిపోయింది. అమె అసలు ముఖం కనబడింది. దీంతో తన భార్యను మేకప్ లేకుండా మొట్టమొదటిసారి చూసిన భర్త.. ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. అప్పుడు అర్థమైంది అతనికి తాను మోసపోయానని, అంతా ఓట్టి భ్రమేనని, తన భార్య, ఏకంగా రూపాన్నే మార్చేసేట్లుగా మేకప్ వేసుకుందని తెలుసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి పెళ్లి చేసుకున్న భార్య ఈమేనా అని బాధపడి.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు.

నకిలీ కనురెప్పలతో సహా అనేక రకాల మేకప్ సామగ్రి వాడితేనే ఆమె తనకు మామూలుగా కనిపించిందని, తీరా చూస్తే ఆమె అసలురంగు తెలిసిందని సదరు భర్త వాపోయాడు. దాంతో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఆమె డాక్టర్ అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆమె కృత్రిమ కనురెప్పలు పెట్టుకోవడంతో పాటు పెళ్లికి ముందు పలురకాల కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. తాను భర్తకు వాస్తవం ఏంటో చెబుదామని అనుకున్నాను గానీ అప్పటికే బాగా ఆలస్యమైందని చెప్పింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతడు ఆమెకు విడాకులు ఇచ్చేశాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : groom  bride  natural face  Sharjah beach  divorce  uae couple  newly married couple  viral news  

Other Articles