‘‘ఎన్నికలలో రిగ్గింగ్ జరుగుతుందని అరవడం అపేయ్’’ Obama to Trump: stop whining

Obama tells trump to stop whining over rigged election claims

Donald Trump, us 2016 election, 2016 us polling, republican party, democratic party, Barack Obama, hillary clinton, rigged election, bill clinton, hillary supporting media, america Us presidential elections

US President Barack Obama lacerated Donald Trump over his repeated assertions that the November 8 election is rigged against him

‘‘ఎన్నికలలో రిగ్గింగ్ జరుగుతుందని అరవడం అపేయ్’’

Posted: 10/19/2016 03:59 PM IST
Obama tells trump to stop whining over rigged election claims

అగ్రరాజ్యం అమెరికా పీఠం కోసం జరగుతున్న తుదిపోరు ఎన్నికలలో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన అరోపణలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా స్పందించాడు. నవంబర్ 8న జరగనున్న తుది ఎన్నికలలో ప్రత్యర్థి పార్టీ రిగ్గింగ్ కు పాల్పడే అవకాశాలు వున్నాయని అవరడం ఆపేసి.. తుది ఎన్నికలలో విజయావకాశాలను మెరుగుపర్చుకోవాలని బరాక్ ఒబామా అయనకు సూచించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ అని అరిచే సమయాన్ని ఓట్లు పోందేందుకు వినియోగించుకోవాలని ఒబామా హితవు పలికారు.

హిల్లరీ క్లింటన్, బిల్ క్లింటన్ సహా వారి అనుకూలంగా మీడియా కలసికట్టుగా ఎన్నికలలో రిగ్గింగ్ కు పాల్పడుతున్నాయిని నిన్న ట్రంప్ అరోపించిన విషయం తెలిసిందే. ఎన్నికల రిగ్గింగ్ లో ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రమేయం కూడా వుండివుండవచ్చునని అయన అనుమానం కూడా వ్యక్తం చేసిన నేపథ్యంలో అయన వ్యాఖ్యలను సిరీయస్ గా తీసుకున్న ఒబామా.. ట్రంప్ పై మండిపడ్డారు.

అమెరికా మీడియా సంస్థలు విడుదల చేస్తున్న ఒపీనియన్ పోల్స్ సర్వేలలో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ ఒటమిపాలవుతారని అభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆయన ఇలాంటి విపరీత రాగాలను అందుకున్నారని ఒబామా అన్నారు. తన ప్రత్యర్థి హిల్లరీ అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల రేసులో ముందునిలువడం కారణంగా అమెను పరాజయం పాలుచేసే శక్తి లేక.. ట్రంప్ చౌకబారు అరోపణలు చేస్తున్నారని అయన మండిపడ్డారు.

ఇప్పటికే అమెరికా అద్యక్ష ఎన్నికలపై అనేక సంస్థలు అధ్యయనాలు చేసి ఎక్కడా ఎలాంటి తప్పిదాలు లేవని వున్నా అవి అవగింజంత ప్రభావం కూడా చూపవని తేల్చిచెప్పినా.. ఓటమి భయంతో ట్రంప్ ఇలాంటి అరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచి.. అ ఎన్నికలనే అపహాస్యం చేసేలా మాట్లాడటం సహించలేమన్నారు. ఇక రిగ్దింగ్ ఎన్నికలలో ఏకంగా శ్వేత సౌధం ప్రమేయం కూడా వుంటుందని చెప్పడం అమెరికావాసులందరినీ అవమానించడమేనని ఒబామా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : donald trump  hillary clinton  Barack Obama  us presidential elections  rigged elections  

Other Articles